Pushpa-2: 'పుష్పరాజ్' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఆ బీట్ వింటే గూస్ బంప్సే!

అల్లు అర్జున్ 'పుష్ప-2 ది రూల్' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. 'పుష్ప పుష్ప పుష్పరాజ్.. భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్ధలయ్యే. నీవు గడ్డం అట్టా సవరిస్తేంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Pushpa-2: 'పుష్పరాజ్' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఆ బీట్ వింటే గూస్ బంప్సే!

Allu arjun: స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప-2 ది రూల్' నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. ఇటీవలే 'పుష్ప పుష్ప పుష్పరాజ్' అంటూ సాగే సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. తాజాగా పూర్తి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. 'నీవు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్ధలయ్యే.. నీవు గడ్డం అట్టా సవరిస్తేంటే దేశం దద్దరిల్లే' అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తుంది సాంగ్.

ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. చంద్రబోస్ రాసిని గీతాన్ని నక్ష అజీజ్, దీపక్ బ్లూలు ఆలపించారు. ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

ఇక పుష్ప మొదటిపార్ట్ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన మూవీ అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది. బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. అలాగే శ్రీవళ్లీ పాత్రలో నటించిన రష్మికకు భారీ గుర్తింపు లభించింది.

Advertisment
తాజా కథనాలు