/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/train-1-jpg.webp)
India's First Private Train: దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా (Thiruvananthapuram to Goa) వరకు ప్రయాణం కొనసాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో (Bharat Gaurav Scheme) భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు.
తిరువనంతపురంలో మొదలయ్యే ఈ రైలు త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ మీదుగా గోవా చేరుకుటుంది. ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైల్లో ఒకేసారి 750 మంది ప్రయాణించొచ్చు.
Also read: హోంమంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచారంలో టెన్షన్..టెన్షన్!
వైద్య నిపుణులతోపాటు మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్ ప్యాకేజీలను రెడీ చేశారు.