తిరుమల ఎక్స్‌ప్రెస్ (Tirumala Express) లో బాణసంచా పేలుడు కలకలం రేపింది. విశాఖ- తిరుపతి (Visakha- tirupati) కి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ (Tirumala express) లో నుంచి పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం విశాఖ పట్నం(Visakhapatnam ) నుంచి తిరుపతి (Tirupati) వెళ్లేందుకు తిరుమల ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. సాయంత్రం 4 గంటల సమయంలో తుని రైల్వే స్టేషన్ లో ఆగింది.
రైలు కదులుతున్న సమయంలో ఎస్ 3 బోగీ లోని వాష్‌రూమ్ దగ్గర ఉన్న సంచిలో నుంచి పొగలు వచ్చాయి. దానిని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో కొందరు చైన్ లాగి రైలును నిలిపివేశారు. అయితే కొందరూ ప్రయాణికులు ఆ సంచిలోని బాణసంచా పేలకుండా కాళ్లతో తొక్కి సంచిని బయటకు విసిరేశారు.
Also read: మహారాష్ట్రల్లో దూసుకెళ్తున్న కారు.. 57 సర్పంచ్ లు గులాబీ కే సొంతం!
సంచిని తీసేసినప్పటికీ కూడా బోగీలో సంచి ఉన్న ప్రదేశంలో పొగలు వస్తుండడంతో చెప్పులతో తొక్కి అదుపు చేశారు. పొగలు రావడం గురించి సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది బోగీని పరిశీలించారు. అనంతరం రైలు అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయింది.
ట్రాక్ పక్కన పడి ఉన్న బాణసంచా సంచిని జీఆర్పీ సిబ్బంది పరిశీలించారు. టక్రాక్ పక్కన సంచి ఉండడంతో దానిని పక్కకి తొలగించారు. ఓ గుర్తు తెలియని ప్రయాణికుడు ఓ సంచిలో బాణసంచా తీసుకుని వెళ్తుండగా స్వల్ప పేలుడు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వెంటనే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సంచిలోని బాణసంచా మొత్తం అంటుకుని ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదన్నారు.
Also read: మాటలకే మాటలు నేర్పిన మాంత్రికుని బర్త్ డే స్పెషల్!