/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Man-Jumping-jpg.webp)
సాధారణంగా చెట్టుపైకి ఎక్కి కిందకి దూకడం, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి దూకడం లాంటివి చేస్తుంటారు. కానీ ఓ నాలుగంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు దూకడాన్ని ఎప్పడైన చూశారా.? అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇంతకి ఎందుకు అతను అలా భవనంపై నుంచి దూకాల్సి వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ్ అనే ప్రాంతంలో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. అయితే ఆ బిల్డంగ్ నాలుగో అంతస్తులో 'మడ్ పైప్ కేఫ్' పేరుతో హుక్కా బర్ అండ్ పబ్ ఉంది. అక్కడ ఉన్న వంటగదిలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం 11.45 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ యువకుడు ఆ నాలుగంతస్తుల బిల్డింగ్‌పై చిక్కుకుపోయాడు. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారి లేక అంత ఎత్తులో నుంచే కిందకి దూకేశాడు.
Also Read: ఈ ఏడాది పెళ్లి సీజన్ లో 35 లక్షల వివాహాలు!
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు 6 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న యువకుడు ప్రాణాలు కాపాడుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. అలాగే ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడినట్లు చెప్పారు. అయితే ఆ యువకుడు అలా బిల్డింగ్‌పై దూకిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరలవుతోంది. నెటీజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియో చూసేయ్యండి.
Massive fire breaks out in a building in #Bengaluru.
Can see clearly that a man Jumping from the 4th floor 😳😳
Incident : Mudpipe pub in Koramangala.#Leo #hospital #Bangalore #FireAccident #LeoTickets pic.twitter.com/IVY4RETkYf
— Naveen (@Naveen_Kandha) October 18, 2023