Andhra Pradesh: విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 40కి పైగా బోట్లు దగ్ధం.. విశాఖలోని ఫిషింగ్ హర్బర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమదంలో 40కిపైగా బోట్లు కాలిపోయాయని అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. By B Aravind 20 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఇతర బోట్లకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మంటలను ఆర్పేసి పరిస్థితిని మరింత తీవ్రతరం కాకుండా అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయినట్లు స్థానికులు అంటున్నారు. అయితే బోట్లలో అప్పటికే నిద్రిస్తున్నవారు మంటలు వ్యాపించడం వల్ల అందులో చిక్కుకొని ఉన్నారేమోనని సిబ్బంది అనుమానించారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.30 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. Also Read: ‘ఆరే’శారు… ‘హెడ్’ లేపేశాడు.. రన్నర్ అప్ తో సరి పెట్టుకున్న భారత్..! #telugu-news #andhra-pradesh-news #vishaka-harbour మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి