Ex. CM Yediyurappa : మైనర్ బాలిక(Minor Girl) పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కర్ణాటక(Karnataka) మాజీ సీఎం చిక్కుకున్నారు. బీజేపీ(BJP) సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(Ex. CM BS Yediyurappa) పై బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై ఫోక్సో(POCSO)తో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (A) కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తెకు జరిగిన మోసం గురించి చెప్పేందుకు యడియూరప్ప వద్దకు వెళ్లగా తన కూతురిని లైంగికంగా వేధించారని బాధితురాలి తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
లైంగిక వేధింపుల ఘటన ఫిబ్రవరి 2న జరిగినట్టగా బాధితురాల తల్లి ఆరోపిస్తున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన మరొక కేసులో సహాయం కోరేందుకు తల్లి, ఫిర్యాదుదారు (17 ఏళ్ల బాలిక) యడియూరప్ప వద్దకు వెళ్లినప్పుడు ఇలా జరిగినట్టు సమాచారం. ఈ కేసులో దోషిగా తేలితే పోక్సో చట్టం 2012 ప్రకారం కనీస శిక్ష 3 సంవత్సరాలు. సెక్షన్ 4 ప్రకారం, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు కోర్టు నిర్ణయించిన కనీస శిక్ష 20 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా. అయితే ఇక్కడ బాలిక వయసు 17ఏళ్లుగా తెలుస్తోంది.
కొట్టిపారేసిన యడియూరప్ప ఆఫీస్:
యడియూరప్ప కార్యాలయం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఫిర్యాదుదారు గతంలో దాఖలు చేసిన కేసుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు ఆమె 51 వేర్వేరు ఫిర్యాదులు చేసినట్టుగా యడియూరప్ప కార్యాలయం చెబుతోంది. వారికి ఫిర్యాదులు చేసే అలవాటు ఉందని చెబుతూ యడియూరప్ప కార్యాలయం ఈ ఆరోపనలను తోసిపుచ్చింది. యడియూరప్ప 2007లో ఏడు రోజులు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2008 నుంచి 2011 వరకు, మే 2018లో మూడు రోజులు, ఆపై జూలై 2019 నుంచి జూలై 2021 వరకు కర్ణాటకలో సీఎం పదవిలో ఉన్నారు.
Also Read : రూ. 1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కింగ్ మార్టిన్ శాంటియాగో ఎవరు? ఆయన ED స్కానర్‌లో ఎందుకు ఉన్నాడు?