Budget 2024: రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్‌ రూపంలోనే బడ్జెట్‌ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది.

BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన
New Update

Interim Budget 2024: కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోడీ సర్కార్ (Modi Govt) జనాకర్షక నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా? లేక ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుందా..అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నవేళ పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిల్లుతోంది. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతుందని, ము ఖ్యంగా వాహనదారులకు బడ్జెట్‌లో (Budget 2024) తీపికబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల (Petrol and Diesel Prices) వల్ల కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్రభారం పడుతోంది. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించొచ్చని తెలుస్తుంది. పెట్రోల్ ధరలను తగ్గిస్తే సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది.

అలాగే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్‌లో సామాన్యులకు లబ్ది చేకూరేలా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి నిర్మలాసీతారామన్ లెక్కలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి.

రేపు ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman). ఈసారి కూడా డిజిటల్‌ రూపంలోనే బడ్జెట్‌ కాపీని (Digital Budget) అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర ఆర్థిక శాఖ. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు నిర్మలా సీతారామన్‌.

ALSO READ: త్వరలో 15వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్నారు నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు. బడ్జెట్‌ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్‌.

146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..!

ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఎన్నికలకు (Parliament Elections) ముందు జరుగనున్న ఈ చివరి పార్లమెంట్ సమావేశాలను(Parliament Meeting) కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అయితే ఇప్పటివరకు 146 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జరగనున్న ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు.

ALSO READ: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ మరోసారి పొడిగింపు

DO WATCH: 

#congress #pm-modi #union-budget-2024 #parliament-budget-sessions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe