Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్‌ డే.. బెయిల్ మీద తుది తీర్పు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవాళ అయినా బెయిల్ దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తుది తీర్పు రానుంది. మరోవైపు ఈ నెల 7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా ముగియనుంది.

New Update
Kavita : ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత..

BRS MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు(Delhi Liquor Scam Case) లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్(Bail Petition) మీద ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. ఈ తీర్పును ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు చెప్పనుంది. అంతకు ముందు సీబీఐ కేసు(CBI Case) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఇరు పక్షాలు తమ వాదనలను కోర్టుకు వినిపించాయి. అనంతరం బెయిల్‌పై కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిష్ మీద తీర్పు ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 22న వాదనలు జరిగాయి. కవిత లాయర్లు, సీబీఐ తరుఫు లాయర్లు ఇద్దరూ కోర్టుకు తమతమ వాదనలు వినిపించారు.ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని.. కవిత మహిళ కాబట్టి పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని కవిత లాయర్‌ వాదనలు వినిపించారు. సరైన ఆధారాలు లేని కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కవిత లాయర్ విక్రమ్‌ చౌదరి కోర్టులో వాదించారు.

ఇక మద్యం కుంభకోణంలో కవితదే కీలక పాత్ర అని సీబీఐ తరుఫు లాయర్‌ వాదించారు. ఆమె బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని.. కాబట్టి బెయిల్‌ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పును ఇవాల్టికి రిజర్వ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్‌ వస్తుందా? మళ్లీ నిరాశేనా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత తీహార్‌ జైల్లో ఉన్నారు కవిత.ఈ నెల 7తోఆమె జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది.

Also Read:Gold Price: గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గుదల.. ఎంత తగ్గిందంటే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు