Viral Fevers: వణికిస్తున్న విష జ్వరాలు!

తెలంగాణ రాష్ట్రాన్ని విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. చికెన్‌ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇతర విష జ్వరాలతో బాధపడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్‌ ఆసుపత్రులు అన్ని నిండిపోయాయనే బోర్డులు కనిపిస్తున్నాయి.

New Update
Viral Fevers: ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే..  లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా?

Viral Fevers: తెలంగాణ రాష్ట్రాన్ని విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా, ఇతర విష జ్వరాల విజృంభణతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచం పై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తుండగా...నగరంలోని కొన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో అయితే బెడ్స్‌ లేవు. వేరే హాస్పిటల్స్‌ వెళ్లండనే బోర్డులు గేట్లకి దర్శనమిస్తున్నాయి.

ఒక వీధిలో కనీసం ఏడు నుంచి ఎనిమిది జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే హాస్పిటల్స్‌ లో మరో పక్క మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ లో నిల్వలు అడుగంటాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ఈ ఏడాది మే నుంచే చర్యలు చేపట్టామని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వ్యాధులు, దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రత్యేక వైద్యుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తుందని వివరించారు.

Also Read: మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్‌.. ఏ అంశాల గురించి చర్చించారంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు