Health Tips: అధిక బరువుతో బాధపడుతుంటే..ఉదయాన్నే ఈ గింజల నీటిని తాగితే చాలు!

స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల రెమెడీస్‌ను అనుసరిస్తారు. వాటిలో ముఖ్యమైనది మెంతుల నీరు. ఈ నీటిని మెంతి గింజలతో పాటుగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

Health Tips: అధిక బరువుతో బాధపడుతుంటే..ఉదయాన్నే ఈ గింజల నీటిని తాగితే చాలు!
New Update

Fenugreek Seeds Water: ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయం (Heavy Weight) వేధిస్తుంది. దానితో పాటు వెంటే అనేక వ్యాధులను తీసుకుని వస్తుంది. ఓ పక్క బరువు పెరిగితే చూడటానికి ఆకారం కూడా వికారంగా తయారవుతుంది. ఊబకాయం పెరగడానికి ముఖ్య కారణం..బయట ఆహారం , జంక్‌ ఫుడ్‌ (Junk Food)  ఎక్కువగా తీసుకోవడమే అని చెప్పవచ్చు.

బయట మార్కెట్‌లో లభించే ప్యాక్డ్ ఫుడ్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉప్పు(Salt), చక్కెర (Sugar)  ఉంటాయి. దీని వల్ల ఊబకాయం పెరగడం మొదలవుతుంది. పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి నాశనం చేసుకోవడానికి తీసుకునే విషయం అని చెప్పవచ్చు. అటువంటి పరిస్థితిలో, బరువును నియంత్రించడం చాలా ముఖ్యం.

స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల రెమెడీస్‌ను అనుసరిస్తారు. వాటిలో ముఖ్యమైనది మెంతుల నీరు. ఈ నీటిని మెంతి గింజలతో పాటుగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. అయితే ఈ నీటిని ఎప్పుడు, ఎలా తాగాలో తెలుసా?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీరు త్రాగాలి.

మెంతి నీరు బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీ. దీని కోసం, 1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టండి. రాత్రంతా ఇలాగే నీళ్లలో ఉంచి ఉదయం ఆ నీటిని కాస్త వేడి చేయాలి. ఇప్పుడు మెంతిగింజలను ఫిల్టర్ చేసి నీటి నుండి వేరు చేయండి. ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దాదాపు అరగంట పాటు ఏమి తినకూడదు. మెంతి నీరు నిరంతరం తాగడం వల్ల  బరువు తగ్గించే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

మెంతి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోజూ మెంతి నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గడంతోపాటు స్థూలకాయం తగ్గడం ప్రారంభమవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి నీరు కూడా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. రోజూ మెంతి నీరు తాగడం వల్ల ఎముకల నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

మెంతులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి.మెంతి నీరు జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. మెంతి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ప్యాంక్రియాస్ మరింత చురుకుగా పని చేస్తుంది. మెంతి నీరు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

Also read: సీఎం తొలి బహిరంగ సభ అక్కడే.. పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌ శంఖారావం

#health-tips #junk-food #healthy-lifestyle #heavy-weight #fenugreek-seeds-water
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి