గగన్ యాన్ తో స్పేస్ లోకి వెళ్లనున్న ‘వ్యోమ మిత్ర’... వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి...!

కరోనా మహమ్మారి వల్ల గగన్ యాన్ మిషన్ ఆలస్యమైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి స్పేస్ ఫ్లైట్ ట్రయల్ ను అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో చేపట్టనున్నట్టు వెల్లడించారు.గగన్ యాన్ మిషన్‌లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమ మిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్టు పేర్కొన్నారు. ఆ రోబో మానవులు చేసే కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. ఆ రోబోతో మిషన్ అంతా సజావుగా అని పిస్తే మిషన్ ను ముందుకు తీసుకు వెళ్తామన్నారు.

author-image
By G Ramu
New Update
గగన్ యాన్ తో స్పేస్ లోకి వెళ్లనున్న ‘వ్యోమ మిత్ర’... వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి...!

Female Robot Vyommitra: చంద్రయాన్-3 విజయం తర్వాత గగన్ యాన్ మిషన్ (Gaganyaan Mission) కు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా గగన్ యాన్ మిషన్ కు సంబంధించిన పలు విషయాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల గగన్ యాన్ మిషన్ ఆలస్యమైందన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి స్పేస్ ఫ్లైట్ ట్రయల్ ను అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో చేపట్టనున్నట్టు వెల్లడించారు.

గగన్ యాన్ మిషన్‌లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమ మిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్టు పేర్కొన్నారు. ఆ రోబో మానవులు చేసే కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. ఆ రోబోతో మిషన్ అంతా సజావుగా అని పిస్తే మిషన్ ను ముందుకు తీసుకు వెళ్తామన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం ఎంత ముఖ్యమో వారిని వెనక్కి తీసుకు రావడం కూడా అంతేముఖ్యమన్నారు.

చంద్రయాన్-3 భూకక్షలో నుంచి చంద్రుని కక్షలోకి ప్రవేశించగానే తనతో పాటు ఇస్రో (ISRO) బృందం చాలా ఉద్విగ్నంగా వున్నామన్నారు. ఇటీవల విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కావడంతో తమకు పెద్ద ఊరట లభించిందన్నారు. ప్రధాని మోడీ (PM Modi) సర్కార్ వచ్చాక అంతరిక్షాన్ని అందరికి అందుబాటులోకి తీసుకు వచ్చారని ఆయన వెల్లడించారు. 2019 వరకు శ్రీహరి కోట గేట్లు మూసి వుండేవన్నారు. కానీ ఈ సారి తమ ప్రభుత్వం విద్యార్థులు, మీడియా వ్యక్తులకు ఆహ్వానం పంపిందన్నారు.

ఇది ఇలా వుంటే అంతకు ముందు చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివ శక్తి (Shiva Shakti)గా ప్రధాన మంత్రి మోడీ నామకరణం చేశారు. చంద్రయాన్-2 వెళ్లిన ప్రాంతాన్ని తిరంగా(Tiranga)గా పిలవాలని పిలుపునిచ్చారు. చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయిన అగస్టు-23ను జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. చంద్రయాన్-3 విజయానికి కారణమైన శాస్త్రవేత్తలందరినీ ఆయన అభినందించారు.

Also Read: చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!

Advertisment
తాజా కథనాలు