Suicide: కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఒంటిపై 500లకు పైగా గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఆమె మృతదేహంపై 500లకు పైగా గాయాల గుర్తులు ఉండటం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. గురువారం తన గదిలో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. పోస్టు మార్టం నివేదికలో ఆమె ఒంటిపై 500లకు పైగా గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఆమెకు మరో కానిస్టేబుల్‌‌ యువకునితో ప్రేమ సంబంధం ఉండేదని స్థానికులు తెలిపారు. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవండంతో.. ఈమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Suicide: కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఒంటిపై 500లకు పైగా గాయాలు
New Update

ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరికొన్ని అనుమానస్పద ఆత్మహత్య ఘటనలు కూడా ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ కానిస్టేబల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మరో విషయం ఏంటంటే ఆమె మృతదేహంపై 500లకు పైగా గాయాల గుర్తులు ఉండటం అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మహిళ మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ఉన్నావ్ పోలీస్ లైన్‌లోని వసతి గృహంలో మీను అనే ఓ మహిళా కానిస్టేబుల్ నివాసముంటోంది.

అయితే గురువారం నాడు తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే యత్నం చేసింది. కానీ ఆమెను కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే మీనును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కానిస్టేబుల్ మీను ఉరివేసుకొని చనిపోయిందని.. అలాగే ఆమె మృతదేహంపై 500ల గాయాల గుర్తులు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు బయటికొచ్చాయి. ఈ నేపథ్యంలో అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీను మోసం చేసి వేరే మహిళను వివాహం చేసుకున్నాడని.. మీను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అతడు స్పందించలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన మీను.. తనను తాను గాయపర్చుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

#national-news #suicide-case #uttar-pradesh-news #woman-constable
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe