- పిల్లలు 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే తాగాలి. తర్వాత ఉడికించిన పండ్లు, కూరగాయలు తినిపించవచ్చు. ఇంట్లో తయారు చేసిన మిల్లెట్ స్లర్రీ వంటి ఆహారాన్ని కూడా ఇవ్వవచ్చు. గంజి, కిచ్డీ, ఓట్స్ వంటి రుచికరమైన, పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వాలి. అది కూడా ఉప్పు లేదా చక్కెర లేకుండా ఇస్తే బెటర్. ఒక సంవత్సరం తర్వాత ఉప్పును క్రమంగా శిశువు ఆహారంలో చేర్చవచ్చు. కానీ ఉప్పు తక్కువగా అలవాటు చేస్తేనే మంచిదని నిపుణులు అంటున్నారు. ఒక సంవత్సరం వరకు పిల్లల మూత్రపిండాలు చాలా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. ఈ టైమ్‌లో వారికి ఉప్పు ఇస్తే కిడ్నీలపై భారం పడుతుంది. కిడ్నీలపై ఉప్పు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
- పిల్లలు పెద్ద మొత్తంలో చక్కెరను తీసుకుంటే వారి శరీరం ప్రోటీన్‌ను సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది మన ఎముకలు, కండరాలు, చర్మాన్ని బలంగా ఉంచుతుంది. ప్రోటీన్లు సరిగా జీర్ణం కానప్పుడు ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. ఎక్కువ చక్కెర తినడం వల్ల చర్మం, రక్తనాళాల పనితీరు తగ్గుతుంది. అంతేకాకుండా పిల్లల దంతాలు పాడవుతాయి. కళ్లు బలహీనంగా మారవచ్చు. కాబట్టి పిల్లలకు పంచదార ఇవ్వకూడదు. చెరుకు రసం లేదా తేనె ఇవ్వాలని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: నైట్ మేకప్ వల్ల ముఖంపై నల్లటి మచ్చలు వస్తాయా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.