Night Makeup: బ్లాక్ హెడ్స్ అనేది ముఖం, మెడ, వీపు, ఛాతీని ప్రభావితం చేసే ఒక సాధారణ పరిస్థితి. చర్మంపై అదనపు నూనె, వెంట్రుకల కుదుళ్లలో సమస్యల కారణంగా బ్లాక్‌హెడ్స్ వస్తాయి. బ్లాక్‌హెడ్స్ ఏ వయసు వారిలోనైనా వస్తాయి. ఇది చర్మంపై గడ్డలుగా ఏర్పడుతుంది. పైకి చూసేందుకు నల్లగా కనిపిస్తాయి.
పూర్తిగా చదవండి..రాత్రిపూట నల్ల మచ్చలు ఏర్పడతాయా?
- రాత్రి సమయంలో మేకప్ వేసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. అందుకే రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. రాత్రి సమయంలో చర్మం ఊపిరి పీల్చుకోలేని స్థాయికి రంధ్రాలు మూసుకుపోతే బ్లాక్ హెడ్ ఏర్పడతాయి. అందుకే నైట్ పార్టీలకు హాజరై వచ్చాక నిద్రపోయే ముందు మేకప్‌ను తొలగించాలని నిపుణులు చెబుతున్నారు.
ఏయే వ్యాధులు బ్లాక్ హెడ్స్‌కి కారణం?
- చర్మం వాపు వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. తామర, సోరియాసిస్, చర్మ గాయాలు, మొటిమలు కారణమంటున్నారు నిపుణులు. ఇన్‌ఫ్లమేటరీతో బాధపడుతున్న వారికి నల్లమచ్చలు అధికంగా ఉంటాయి.
హార్మోన్ల మార్పులు:
- గర్భధారణ సమయంలో, వృద్ధాప్యంలో స్త్రీల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత కారణంగా చర్మంపై డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఏర్పడవచ్చు. ఈ హార్మోన్ల మార్పు వల్ల చర్మంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది ప్రధానంగా ఆండ్రోజెన్ హార్మోన్ పెరుగుదల కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా ఎండకు ఉండటం:
- ఎక్కువసేపు నేరుగా సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇది నల్ల మచ్చలను కలిగిస్తుంది. ఎక్కువగా చేతులపై కనిపించే ఈ చిన్న చుక్కల వంటి లక్షణాలు చివరికి బ్లాక్‌హెడ్స్‌గా మారుతాయి. చర్మం నేరుగా సూర్యరశ్మికి గురైనప్పుడు ఈ నల్ల మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
డయాబెటిస్ ఉంటే నల్ల మచ్చలు వస్తాయా?
- మధుమేహం ఉన్నప్పుడు చర్మంపై మచ్చలు నల్లగా మారుతాయి. ఈ సందర్భంలో చర్మం రంగు మారిపోతుంది. దీనిని డయాబెటిక్ డెర్మోపతి అంటారు. కొన్నిసార్లు ఈ చర్మ సమస్య మధుమేహం లక్షణం కావచ్చు. చిన్న వయసులో నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. మీకు డయాబెటిస్ ఉంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవడం, చర్మ సంరక్షణ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
మందులు కూడా కారణమా?
- కొన్ని మందులు చర్మం రంగును మార్చగలవు. నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు, సైకియాట్రిక్ డ్రగ్స్ కూడా చర్మంపై నల్ల మచ్చలను కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో తిమ్మిరి వస్తోందా?..ఇదే కారణం కావొచ్చు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
[vuukle]