FD Fraud : కస్టమర్ల డబ్బులు కొట్టేసి ఆన్‌లైన్ గేమ్‌లు.. బ్యాంక్ ఆఫీసర్ నిర్వాకం 

ఆన్‌లైన్ గేమ్‌ల పిచ్చితో తాను పనిచేస్తున్న బ్యాంక్ లోనే మోసాలకు పాల్పడ్డాడు పంజాబ్ అండ్  సింధ్ బ్యాంక్ మాజీ అధికారి బెదాన్షు శేఖర్ మిశ్రా. కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను (FD) బ్రేక్ చేయడం ద్వారా ₹ 52 కోట్ల కంటే ఎక్కువ సొమ్మును స్వాహా చేయడంతో ఈడీ కేసులు నమోదు చేసింది. 

New Update
FD Fraud : కస్టమర్ల డబ్బులు కొట్టేసి ఆన్‌లైన్ గేమ్‌లు.. బ్యాంక్ ఆఫీసర్ నిర్వాకం 

Fixed Deposit Fraud : ఆన్‌లైన్ గేమ్‌లు(Online Games) ఆడేందుకు ₹ 52 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్‌ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను(FD) బ్రేక్ చేసిన పంజాబ్ అండ్  సింధ్ బ్యాంక్ మాజీ అధికారి ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ED అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ బ్యాంక్ అధికారి బెదాన్షు శేఖర్ మిశ్రాపై(FD Fraud) జప్తు చర్యలు చేపట్టింది.

నిందితుడైన బ్యాంక్ ఉద్యోగి ₹2.56 కోట్ల విలువైన స్థిరాస్తి, ఫిక్స్‌డ్ డిపాజిట్లను సీజ్ చేసినట్లు ఇడి తెలిపింది. ఈ మోసం కేసు 2021-22కి చెందినది.  ఈకేసును  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఫైల్ చేశారు. 

బెదాన్షు శేఖర్‌పై తీసుకున్న చర్యల గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తెలియజేసింది.బ్యాంక్ నవంబర్ 2022లో బెదాన్షుని సస్పెండ్ చేసింది.

Also Read: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

బేదాన్షు తన తోటి సిబ్బంది(FD Fraud) ఐడీలను దొంగతనం చేశాడు. తరువాత వాటిని ఉపయోగించి కస్టమర్ల FD లను బ్రేక్ చేశాడు. ఆ డబ్బును తన ఫేక్ ఎకౌంట్స్ కి మళ్లించుకుని.. ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. ఈ విషయం బ్యాంకుకు తెలియడంతో, అతను నవంబర్ 2022లో సస్పెండ్ అయ్యాడు.

బేదాన్షు శేఖర్ మిశ్రా రూ. 52,99,53,698 ఎగ్గొట్టినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఒక్క బ్యాంకులోనే కాకుండా ఖాతాదారులనూ(FD Fraud) నేరుగా మోసం చేశాడు. వారి సంతకాలను ఫోర్జరీలు చేయడం ద్వారా వారి ఎకౌంట్స్ ఖాళీ చేసేశాడు.

Watch this interesting Video :

Advertisment
తాజా కథనాలు