FD Fraud : కస్టమర్ల డబ్బులు కొట్టేసి ఆన్లైన్ గేమ్‌లు.. బ్యాంక్ ఆఫీసర్ నిర్వాకం
ఆన్లైన్ గేమ్‌ల పిచ్చితో తాను పనిచేస్తున్న బ్యాంక్ లోనే మోసాలకు పాల్పడ్డాడు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మాజీ అధికారి బెదాన్షు శేఖర్ మిశ్రా. కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) బ్రేక్ చేయడం ద్వారా ₹ 52 కోట్ల కంటే ఎక్కువ సొమ్మును స్వాహా చేయడంతో ఈడీ కేసులు నమోదు చేసింది.