Telangana: బెట్టింగ్‌కు అలవాటు పడ్డ కొడుకుని హతమార్చిన తండ్రి

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో దారుణం జరిగింది. బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.2 కోట్లు పోగొట్టిన కొడుకుని తండ్రి హతమార్చడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు.

New Update
Telangana: బెట్టింగ్‌కు అలవాటు పడ్డ కొడుకుని హతమార్చిన తండ్రి

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో దారుణం జరిగింది. బెట్టింగ్‌లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కొడుకుని తండ్రి హతమార్చడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని ముకేశ్ కుమార్ (28) బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డాడు. దీంతో ఇవి మానుకోవాలని తండ్రి సత్యనారాయణ ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ముకేశ్ వినకుండా బెట్టింగ్‌లో ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టాడు.

Also Read: ఈసారి జగన్ కు 51 సీట్లు కూడా రావు.. RTVతో ప్రశాంత్ కిషోర్ సంచలన ఇంటర్వ్యూ

కొడుకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మారకపోవడంతో శనివారం రాత్రి తండ్రి సత్యనారాయణ కొడుకుపై దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రగాయాలపాలై కొడుకు మృతి చెందాడు. ముకేశ్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బెట్టింగ్ పాల్పడి.. మోడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాట్లు అమ్మేశాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడు ముకేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Also Read: ఏపీలో రేపే ఎన్నికల సమరం.. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారంటే?

Advertisment
తాజా కథనాలు