Andhra Pradesh : ఏపీలో రేపు 175 అసెంబ్లీ(Assembly), 25 ఎంపీ స్థానాలకు పోలింగ్(Polling) జరగనుంది. సెక్టార్ల వారీగా ఈవీఎంల(EVM) పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. సాయంత్రానికల్లా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ చేస్తారు. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది 224 పోలింగ్ కేంద్రాలను పెంచింది ఈసీ. 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. 14 సమస్యాత్మక నియోజకవర్గాలపై నిఘా ఏర్పాటు చేసింది ఈసీ. ఆ నియోజకవర్గాల్లో CRPF బలగాలను మోహరించారు.
AP Elections 2024 : ఏపీలో రేపే ఎన్నికల సమరం.. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారంటే?
ఏపీలో రేపు జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 14 సమస్యాత్మక నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసీ. పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: