Rape case: కన్న కూతురిని కాటేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు!

కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రికి కేరళ స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 101 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 10 ఏళ్ల వయసు నుంచే ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడగా 16 ఏళ్ల వయసులో బాలిక గర్భం దాల్చింది. వైద్యులు మూడు నెలల గర్భాన్ని తొలగించారు.

New Update
Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..!

Kerala: కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రికి కోర్టు కారాగార శిక్ష విధించింది. ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డ దుర్మార్గుడికి 101 ఏళ్ల జైలు శిక్షతో (101 Years Of Jail) పాటు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తూ తీర్పు వెల్లడించింది. కేరళలోని మల్లపురంలో ఈ దారుణంగా చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

డీఎన్‌ఏ పరీక్ష చేయగా..
ఒక తండ్రి 10 ఏళ్ల వయసున్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనూ, తల్లి రాత్రి నిద్రిస్తుండగా ఆమెను బెదిరించి లొంగదిసుకున్నాడు. అలా దాదాపు 6ఏళ్లపాటు దారుణానికి పాల్పడగా ఆ బాలిక16 ఏళ్లకే గర్భంగా దాల్చింది. ఆమె గర్భం దాల్చడంతో అతడే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. డీఎన్‌ఏ పరీక్ష చేయగా అసలు విషయం తెలుసుకున్న డాక్టర్లు.. మూడు నెలల గర్భాన్ని తొలగించారు.

అయితే ఈ కేసుపై మంగళవారం విచారణ జరిపిన కేరళ లోని స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. పోక్సో, జువెనైల్ జస్టిస్‌ యాక్ట్‌ వంటి చట్టాల కింద నిందితుడికి శిక్ష వేసింది. ‘ఒక తండ్రిగా బాలికను కాపాడాల్సిన వ్యక్తే.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చేవరకు కారణమయ్యాడు. దీనిని సాధారణ లైంగిక నేరంగా చూడలేం. నేరానికి పాల్పడిన వ్యక్తిపై కనికరం చూపలేం' అని పేర్కొంది.

Also Read: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని.. దట్టమైన అడవిలో చిక్కుకున్న విద్యార్థులు

Advertisment
తాజా కథనాలు