Farmers Protest: మాపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదు.. రైతు సంఘాల హెచ్చరిక

శుక్రవారం రైతు సంఘాలతో కేంద్రమంతులు జరిపిన చర్చలు మూడోసారి విఫలమయ్యాయి. ఫిబ్రవరి 18న మరోసారి చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే తమపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదంటూ రైతు సంఘాలు హెచ్చరించాయి.

Farmers Protest: మాపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదు.. రైతు సంఘాల హెచ్చరిక
New Update

పంటలకు కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని ఢిల్లీ సరిహద్దుల్లో గత నాలుగురోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్​ మోర్చా సహా అనేక రైతు సంఘాలు.. శుక్రవారం గ్రామీణ భారత్​బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్​బంద్‌ని అత్యంత కీలకంగా భావిస్తున్నాయి రైతు సంఘాలు. ఈ బంద్.. ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని రైతలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Also Read: రేపు జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం

అసంపూర్తిగా ముగిసిన చర్చలు 

అయితే శుక్రవారం రైతు సంఘాల నేతలతో.. కేంద్రమంత్రులు చంఢీగడ్‌లో చర్చలు జరిపినప్పిటికీ అవి అసంపూర్తిగా ముగిశాయి. రైతు సంఘాలు పెట్టిన డిమాండ్లకు పరిష్కారం దోరకకపోవడంతో.. మూడుసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై రైతు సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా రైతుల నుంచి వస్తున్న డిమాండ్లలో.. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, 2013 భూసేకరణ చట్టం జాతీయస్థాయి అమలు అలాగే భూసేకరణలో రైతు లిఖితపూర్వక సమ్మితితో సహా.. కలెక్టర్ నిర్ణయించిన ధరకు 4 రేట్లు చెల్లింపు వంటి తదితర అంశాలపై చర్చలు జరిపారు.

వెనక్కి తగ్గేది లేదు

MSPకి చట్టబద్ధమైన హామీ అమలులో వచ్చే సమస్యలపై కేంద్రమంత్రులు రైతు సంఘాలకు వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. వివిధ అంశాల్లో ప్రభుత్వానికి రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. కనీస మద్దతు ధర విషయంలో తాము వెనక్కి తగ్గేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. రైతు సంఘాలతో చర్చ ముగిసిన అనంతరం.. కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడారు. రైతు సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగినట్లు పేర్కొన్నారు. వీటిలో అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.

ఫిబ్రవరి 18న మరోసారి చర్చలు 

తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని రైతు సంఘం నాయకుడు జగ్జీత్‌ సింగ్ దల్లేవాల్ అన్నారు. ఆదివారం సానుకూల ఫలితం రాకపోతే.. తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని.. నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. తమపై హింసాత్మక చర్యలకు దిగినా కూడా వెనక్కి తగ్గేది లేదని మరికొందరు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. తాము పాకిస్థాన్ వాళ్లం కాదని.. భారతీయులమని.. తమపై బల ప్రయోగం చేయడం కరెక్ట్‌ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 18న మరోసారి చర్చలు జరిపేందుకు అటు కేంద్ర మంత్రులు, ఇటు రైతు సంఘాలు మరోసారి ఏకాభిప్రాయం కుదుర్చుకున్నాయి.

Also Read: రష్యా ఉపగ్రహాలను అంతం చేసే ఆయుధం తయారుచేస్తోంది: అమెరికా

రైతుల డిమాండ్​లు ఏంటి?
1. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగూణంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం చేయడం,
2. రైతులకు రుణ మాఫీ చేయాలి
4. 2020 విద్యుత్​ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
5. లఖింపుర్​ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించాలి
6. గతంలో చేపట్టిన నిరసనలో రైతులపై పెట్టిన కేసులను రద్దు చేయాలి
7. WTOతో చేసుకున్న ఒప్పందాలపై నిషేధం విధించాలి
8. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి.. 200 రోజులకు పని దినాలను పెంచి.. రోజువారీ కూలి రూ.700 ఇవ్వాలి
9. రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి
10. 2013 భూసేకరణ చట్టం అమలు.. నాలుగు రెట్ల పరిహారం అందించాలి
11.నకిలీ విత్తనాలు, పురుగు మందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
12.మిర్చి, పసుపు సుగంధ పంటలకు సంబంధించి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి
13. ఆదివాసుల హక్కులను, అటవీ భూములను రక్షించేలా చర్యలు తీసుకోవాలి

#telugu-news #farmers-protest #bjp #delhi-chalo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి