Farmers Protest: కదం తొక్కిన రైతులు.. ప్రధాన డిమాండ్లు ఇవే..

ఢిల్లీ ఛలో పేరుతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకుని ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బవానా స్డేడియాన్ని జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఢిల్లీ సర్కార్ తిరస్కరించింది.

New Update
Delhi: ఢిల్లీకి రైతులు పాదయాత్ర... భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ఈ 5 సరిహద్దులు మూసివేత!

Farmers Protest Delhi: లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్నదాతలు మరోసారి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లును నెరవేర్చాలంటూ మరోసారి రణరంగంలోకి దిగారు. ఢిల్లీ ఛలో (Delhi Chalo) పేరుతో మంగళవారం హస్తినాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకురాకపోవడంతో.. పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లపై అక్కడికి తరలివచ్చారు. దీంతో ఢిల్లి సరిహద్దు వద్ద రాకపోకలు అంతరాయం కలిగింది.

రైతులు డిమాండ్లు ఏంటంటే

1. రైతులకు సాగు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి

2. MS స్వామినాథన్‌ (Swaminathan) సిఫార్సులకు తగ్గట్లుగా అన్ని పంటలకు కూడా మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావాలి

3. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి.. నాలుగు రేట్ల పరిహారం చెల్లించారు.

4. WTOతో చేసుకున్నటువంటి ఒప్పందాలపై నిషేధం విధించాలి

5. రైతులకు అలాగే రైతు కూలీలకు పెన్షన్‌ (Pension) అందించాలి

6. విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలి

7. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానించి 200 రోజులకు పని దినాలు పెంచాలి. రోజూవారీ కూలి రూ.700 అందించాలి

8. ఫేక్ విత్తనాలు, పురుగు మందుల తయారీదారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి

9. మిర్చి, పసుపు, సుగంధ పంటలకు సంబంధించి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి

10. ఆదివాసుల హక్కులను, అటవీ భూములను రక్షించాలి

11. లఖిన్‌పురి ఖేరి ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి.. బాధిత రైతులను ఆదుకోవాలి

12. ఢిల్లీలో చేసిన రైతుల ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే పరిహారం అందించాలి

Also Read: గుడ్ న్యూస్.. ముందుగానే డెమెన్షియా గుర్తించే విధానం రాబోతోంది!

కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ సరిహద్దు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఛలో ఢిల్లీ పేరుతో రైతులు నిరసనకు దిగిన వేళ.. బవానా స్టేడియాన్ని జైలుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ కేంద్రం ప్రతిపాదనకు ఢిల్లీ సర్కార్ నో చెప్పింది. రైతుల డిమాండ్లు హేతుబద్ధమైనవని.. వాళ్లను అరెస్టు చేయడం పద్దతి కాదని ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లాట్ అన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేయడం అనేది ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు అంటూ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. రైతుల డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఈ అంశంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Also Read: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్!

Advertisment
తాజా కథనాలు