Telangana: రైతన్నలకు శుభవార్త.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..!

తెలంగాణలో రైతాంగానికి శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. రూ. 2 లక్షల రుణమాఫీపై అడుగులు వేసింది. రుణమాఫీకి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే బ్యాంకర్లతో అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉంది.

Telangana: రైతన్నలకు శుభవార్త.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..!
New Update

Loan Waiver in Telangana: ఎన్నికల మేనిపెస్టోలో పేర్కొన్న మేరకు రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీకి(Loan Waiver) ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్‌ డిస్కషన్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రైతు రుణమాఫి అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్(Congress) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి రూ. 36 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు అంటే ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. నిధుల సమీకరణ ఎలాగా? అని ఆలోచనలో పడింది ప్రభుత్వం.

కాగా, రుణమాఫీకి సంబంధించి కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. బ్యాంకులతో చర్చలకు సిద్ధమవుతున్నారు ఆఫీసర్స్. బ్యాంకులకు నెలకు రూ. 600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బ్యాంకులను సైతం ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో రైతు భరోసా కింద రూ. 2 లక్షల రుణమాఫీ పథకం కూడా ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. రూ. 2 లక్షల లోపు తీసుకున్న రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనే సీఎం అవడంతో.. రైతు రుణమాఫీ దిశగా అడుగులు వేస్తున్నారు.

Also Read:

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీలు..

ఏంది వర్మా.. పవన్‌ను అంత మాట అనేశావ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో మరి..!

#telangana #crop-loan-waiver #crop-loans
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe