Farmer Protest: మరోసారి రోడ్డెక్కనున్న రైతు సంఘాలు.. చలో ఢిల్లీ తో పోలీసులు అలర్ట్‌.. ట్రాఫిక్‌ మళ్లింపు!

రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.ముందుగానే ఏఏ మార్గాల్లో ప్రయాణించకూడదో అధికారులు తెలియజేశారు.

New Update
Delhi:రైతుల ధర్నా...మార్చి 12 వరకు ఢిల్లీలో 144 సెక్షన్

Delhi: ఢిల్లీ(Delhi) లో మరోసారి నిరసనకు రైతు సంఘాలు(Farmers)  సిద్ధమవుతున్నాయి. చలో ఢిల్లీ (Chalo Delhi)నినాదంతో రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఫిబ్రవరి 13న ఢిల్లీలో ర్యాలీకి రైతు సంఘాలు పిలుపునిచ్చాయని తెలియజేశారు. దీనికి ముందు, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 11వ తేదీన ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.

వాహనాల దారి మళ్లింపు..

నగరం అంతటా ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా, ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. ముందుగానే ఏఏ మార్గాల్లో ప్రయాణించకూడదో ప్రయాణికులకు అధికారులు తెలియజేశారు. సోమవారం (ఫిబ్రవరి 12) నుంచే వాణిజ్య వాహనాల రాకపోకలను సరిహద్దుల్లో పూర్తిగా నిషేంధించనున్నారు.

మంగళవారం సింగు సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు వివరించారు. సింగు సరిహద్దు నుంచి ఎటువంటి వాహనాల రాకపోకలు ఉండవని అధికారులు వివరించారు. దీంతో ఢిల్లీ నుండి నోయిడా, ఘజియాబాద్‌కు వెళ్లే వారు కొన్ని సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందని పోలీసులు తెలిపారు.

వాస్తవానికి, లోని బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్, చిల్లా బోర్డర్, కలిదిన్ కుంజ్-డీఎన్‌డీ-నోయిడా బోర్డర్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, హర్యానా, పంజాబ్ నుండి ఇంటర్‌స్టేట్ బస్సుల ద్వారా వచ్చే ప్రజలు కూడా సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే సింగు సరిహద్దును అధికారులు మూసివేశారు.

ఢిల్లీలో మళ్లింపు ఎక్కడ 
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల సలహా ప్రకారం, ఢిల్లీ నుండి సోనిపట్‌, జాతీయ రహదారి 44 మీదుగా ప్రయాణాన్ని పూర్తి చేయడానికి, అంతర్రాష్ట్ర బస్సులు కాశ్మీర్ గేట్ బస్టాండ్ నుండి మజ్ను కా తిలా, సిగ్నేచర్ బ్రిడ్జ్, ఖజురీ చౌక్, లోని బోర్డర్ మీదుగా వెళ్లాలి. . అదే సమయంలో, భారీ వాణిజ్య వాహనాలు బవానా రోడ్ క్రాసింగ్ మీదుగా DSIIDC కట్ మీదుగా వెళ్లి, ఆచండీ బోర్డర్ నుండి సయీద్‌పూర్ చౌకీ మీదుగా KMP మీదుగా బవానా చౌక్ మీదుగా వెళ్లాలి.

రోహ్ తక్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డులోని ముకర్బా చౌక్ మీదుగా రిథాలా, యూఈఆర్ 2, కంఝవాలా, జౌంటీ సరిహద్దుల మీదుగా హర్యానాలోకి ప్రవేశించాలని అధికారులు ముందగానే సూచించారు.

Also read: పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు..ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు