Bharat Bandh: భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. 144 సెక్షన్‌ అమలు!

శుక్రవారం రైతు సంఘాలు భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసు అధికారులు అనధికార బహిరంగ సభలపై నిషేధం విధించడంతో పాటు 144 సెక్షన్‌ కింద ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Bharat Bandh: భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. 144 సెక్షన్‌ అమలు!
New Update

శుక్రవారం రైతు సంఘాలు భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసు అధికారులు అనధికార బహిరంగ సభలపై నిషేధం విధించడంతో పాటు 144 సెక్షన్‌ కింద ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నోయిడాలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రయాణాలు చేసే వారు సాధ్యమైనంత వరకు మెట్రో సేవలు వినియోగించుకోవాలని కోరారు.

రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా , ఇతర రైతు సంఘాలు పిలుపునిచ్చిన మేర ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చాలో భాగమైన భారతీయ కిసాన్‌ యూనియన్‌ రైతుల డిమాండ్లను పేర్కొంటూ వాటిని వెంటనే అమలు చేయాలని కోరింది. ఈ మేరకు ఫిబ్రవరి 16 వ తేదీ శుక్రవారం నాడు భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చింది.

నోయిడాకు చెందిన భారతీయ కిసాన్ పరిషత్ (బికెపి) కూడా శుక్రవారం నాటి భారత్ బంద్‌కు మద్దతు తెలిపింది. "SKM, వివిధ సంస్థలు శుక్రవారం నిరసన ప్రదర్శనలు వంటి వివిధ కార్యక్రమాలను ప్రతిపాదించాయి. అందువల్ల, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 ఫిబ్రవరి 16 నుండి అమలు చేయనున్నట్లు" పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఉత్తర్వు ప్రకారం, నలుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఓ గుంపుగా ఉంటే కనుక వారిని అదుపులోనికి తీసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాజకీయ, అనధికార ఊరేగింపులను నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వ సంస్థలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌ల వినియోగాన్ని కూడా నిషేధించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో కర్రలు, రాడ్‌లు, త్రిశూలాలు, కత్తులు, తుపాకీలు లాంటి వాటిని తీసుకెళ్లడాన్ని నిషేధించారు.

ట్రాఫిక్ అడ్వైజరీలో, నోయిడా, ఢిల్లీ సరిహద్దుల్లో ఇరువైపులా పోలీసులుచే అడ్డంకులు ఏర్పాటు చేయడం ద్వారా ఇంటెన్సివ్ చెకింగ్ జరుగుతుందని, దీని కారణంగా వాహనాల రాకపోకలపై ఒత్తిడి ఉంటుందని అంతేకాకుండా అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

"ఢిల్లీకి వెళ్లే ప్రజలు ట్రాఫిక్ అసౌకర్యాన్ని నివారించడానికి వీలైనంత వరకు మెట్రోను ఉపయోగించండి. యమునా ఎక్స్‌ప్రెస్‌వే నుండి నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఢిల్లీకి, సిర్సా నుండి పారి చౌక్ మీదుగా సూరజ్‌పూర్ వరకు అన్ని రకాల వస్తువుల వాహనాల రాకపోకలు నియంత్రించడం జరిగింది. ట్రాఫిక్ అసౌకర్యాన్ని నివారించడానికి, డ్రైవర్లు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించవచ్చు” అని పోలీసులు తెలిపారు.

తమ యూనియన్ పిలుపునిచ్చిన భారత్ బంద్ సందర్భంగా డిమాండ్‌ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఒకరోజు సమ్మె చేయాలని కోరినట్లు బీకేయూ నేత పవన్ ఖతానా తెలిపారు. "రైతులు పొలాల్లో పనికి దూరంగా ఉండాలని, ఎటువంటి కొనుగోళ్ల కోసం మార్కెట్‌లకు వెళ్లవద్దని కోరారు. వ్యాపారులు, రవాణాదారులు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు. నిరసనకారులు తమ ప్రాంతాల్లోనే ఉంటారని, ఢిల్లీ వైపు కవాతు చేయరని రైతు నాయకుడు చెప్పారు. ఇదిలా ఉండగా, సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరింది.

"తరచుగా జరిగే రైతు ఉద్యమాలు రోజువారీ వ్యాపార కార్యకలాపాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. పౌరులు అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. రవాణా మార్గాలను మూసివేయడం వలన ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు," నోయిడా సెక్టార్ 18 మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ జైన్ అన్నారు.

"సాధారణ పౌరుల జీవితాలను అడ్డుకోవడం ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని మేము ప్రభుత్వానికి, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము" అని జైన్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్థానిక అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీకేపీ భారత్ బంద్‌కు మద్దతు తెలిపింది.

"ఈ చొరవను ముందుకు తీసుకెళ్లడానికి రైతులందరూ ఇక్కడ సెక్టార్ 24లోని NTPC కార్యాలయం వెలుపల సమావేశమవుతారు" అని BKP ఒక ప్రకటనలో తెలిపింది.

Also read: పెయింట్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది సజీవ దహనం!

#farmers #delhi #protest #bharat-bandh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి