Warner : విమర్శకులను బ్యాట్‌తో బాదేసిన డేవిడ్‌ భాయ్‌.. ఫేర్‌వెల్‌ సిరీస్‌లో వార్నర్‌ ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌!

ఫేర్‌వెల్‌ టెస్టు సిరీస్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్‌ సెంచరీతో కదం తొక్కాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. పాక్‌పై 211 బంతుల్లో 164 రన్స్‌ చేసిన వార్నర్‌ వన్డే స్టైల్‌లో బ్యాటింగ్‌ చేసి విమర్శకుల మూతి మూయించాడు.

New Update
Warner : విమర్శకులను బ్యాట్‌తో బాదేసిన డేవిడ్‌ భాయ్‌.. ఫేర్‌వెల్‌ సిరీస్‌లో వార్నర్‌ ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌!

David Warner : క్రికెటర్లైనా.. సామాన్య ప్రజలైనా విమర్శల పాలవ్వాల్సిందే.. ఎవరో ఒకరు నిత్యం ఏదో ఒకటి అంటునే ఉంటారు. మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక ఏదో వాగుతుంటారు. కొంతమంది అసూయతో మాట్లాడుతుంటారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner) గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఇండియాలో వార్నర్‌ అంటే ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టం. డేవిడ్‌ భాయ్‌ అని ముద్దుగా పిలుచుకునే వార్నర్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీ అందించాడు. అయితే తర్వాత అతడిని ఫ్రాంచైజీ పక్కన పెట్టడం ఫ్యాన్స్‌ను ఎంతో బాధ పెట్టిండి. శాండ్‌పేపర్‌ స్కాండల్‌లో దోషిగా తేలిన వార్నర్‌ ఏడాదికిపైగా క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇక గత నెలలో ముగిసిన వరల్డ్‌కప్‌లోనూ వార్నర్ రాణించాడు. ఆస్ట్రేలియా(Australia)కు వరల్డ్‌కప్‌ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తాజాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ వార్నర్‌కు ఆఖరిది. ఫేర్‌వెల్‌ టేస్టు సిరీస్‌లో వార్నర్‌ దుమ్మురేపుతున్నాడు. సెంచరీతో అదరగొట్టాడు.


భలే జంప్‌ చేశావ్‌ భయ్యా:
వార్నర్‌కు ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌ ఉంది. సెంచరీ చేయగానే గాల్లోకి ఎగురుతాడు వార్నర్‌. చాలా ఎత్తుకు ఎగిరి సెలబ్రేట్‌ చేసుకునే వార్నర్‌ జంప్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. పాకిస్థాన్‌పై జరుగుతున్న తొలి టెస్టులో వార్నర్‌ సెంచరీ చేశాడు. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇదే తన చివరి టెస్టు సిరీస్ అని ఆసీస్ స్టార్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టెస్టుల్లో వార్నర్‌ అంత ఫామ్‌లో లేడు. దీంతో ఫామ్ లేని వార్నర్‌ని ఎలా ఎంపిక చేస్తారని విమర్శలు గుప్పించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వీరిలో మాజీలు ఎక్కువ. ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ మిచెల్ జాన్సన్‌ బహిరంగంగానే వార్నర్‌పై విమర్శలు గుప్పించాడు. క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద స్కామ్స్‌లో ఒకటైన్‌ 'శాండ్‌పేపర్‌' వివాదంలో వార్నర్‌ దోషి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న మాజీలు.. ఇలాంటి ఆటగాడికి ఫేర్‌వెల్‌ సిరీస్‌ పెడతారా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇవేవీ పట్టించుకోని వార్నర్‌ తన సత్తా చూపించాడు. సెంచరీ తర్వాత ట్రేడ్‌ మార్క్‌ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు.


తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 346 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులో మిచెల్ మార్ష్‌, అలెక్స్‌ క్యారీ ఉన్నారు. ఓపెనర్‌ వార్నర్‌ 211 బంతుల్లో 164 రన్స్ చేశాడు. ఇందులో 16 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్‌ ఉస్మన్‌ ఖవాజా 98 బంతుల్లో 41 రన్స్ చేశాడు. ఇక ట్రావిస్‌ హెడ్‌ 53 బంతుల్లో 40 రన్స్‌తో రాణించాడు. అటు పాకిస్థాన్‌ బౌలర్లు తేలిపోయారు. వన్డే తరహాలో పరుగులు సమర్పించుకున్నారు.

Also Read: మూతికి కుట్లు.. తీవ్రమైన నొప్పి.. అయినా జట్టుకోసం బరిలోకి..! తమిళనాడు క్రికెటర్‌కి క్రీడా లోకం సెల్యూట్!

WATCH:

Advertisment
తాజా కథనాలు