Asia Cup: బీసీసీఐ తప్పు చేస్తుందా? ఆ ముగ్గురు ఆటగాళ్లతో సమస్యలు తప్పవా?

ఆసియా కప్‌కి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నికి తెరలేవనుండగా.. టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్‌, అయ్యర్‌ ఎలా ఆడుతురాన్నదానిపై అందరిచూపు నెలకొంది. అటు హార్దిక్‌ పాండ్యా నిలకడలేమి ఫామ్‌ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేస్తోంది.

New Update
Asia Cup: బీసీసీఐ తప్పు చేస్తుందా? ఆ ముగ్గురు ఆటగాళ్లతో సమస్యలు తప్పవా?

ASIA CUP 2023: ఆసియా కప్‌ స్టార్ట్ అవ్వడానికి మరో వారం రోజులు మాత్రమే ఉంది. టీమిండియాకు ఇది వరల్డ్‌ కప్‌ రిహార్సల్స్ లాంటిది. అటు 43 రోజుల్లోనే వరల్డ్ కప్‌ ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు టీమిండియా తమ ప్లేయంగ్‌ ఎలెవన్‌ గురించి.. మొత్తం టీమ్‌ ప్రాబెబుల్స్‌ గురించి ఓ అంచనకు రాకపోవడం ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లకు గాయాలు, ఇప్పుడుప్పుడే కోలుకోవడం.. వాళ్లు కూడా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నారన్నదానిపై క్లారిటీ లేకపోవడం మరింత ఆందోళన పరిచే అంశం.

publive-image పాండ్యా, అయ్యర్, రాహుల్ (Image Credit/BCCI)

ఆ ముగ్గురు ఆటగాళ్ల పాత్ర ఏంటి?
ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇటివలి కాలంలో పేలవంగా ఆడుతున్నాడు. అసలు ఆల్‌రౌండర్‌ అని అనడం కూడా దండగే అనిపించేలా హార్దిక్‌ ఆటతీరు ఉందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బౌలింగ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ హార్దిక్‌ మునపటిలా ఆడడంలేదన్న విమర్శలున్నాయి. మాజీ ఆటగాళ్లు మదన్‌లాల్‌ లాంటి వాళ్లు సైతం హార్దిక్‌ ఫామ్‌ని ప్రశ్నిస్తున్నారు. వరల్డ్‌ కప్‌ టైమ్‌కి హార్దిక్‌ అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఇక శివమ్‌ దుబేని హార్దిక్‌ బ్యాకప్‌గా ఉంచాలని గౌతమ్‌ గంభీర్‌ సూచిస్తున్నాడు.

ఇక నాలుగు నెలల గ్యాప్‌ తర్వాత టీమిండియా తరుఫున బరిలోకి దిగుతున్న రాహుల్‌ ఫిట్‌నెస్‌ గురించి కూడా అనేక అనుమానాలున్నాయి. ఐపీఎల్ టైమ్‌లో గాయపడ్డ రాహుల్‌ ఇటివలే కోలుకున్నాడని బీసీసీఐ చెప్పింది. అయితే సెలక్టర్ల చైర్మన్‌ అజిత్ అగార్కర్‌ మాత్రం రాహుల్ ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని చెప్పాడు. అసలు రాహుల్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నాడా లేదా అన్నదానిపై ఓ క్లారిటీ లేదు. అందులోనూ రాహుల్‌ని కీపర్‌ పాత్ర పోషించనున్నాడు. పూర్తిగా కోలుకోకముందే ఆడిస్తే వరల్డ్ కప్‌ టైమ్‌కి గాయం తిరగబెట్టే అవకాశాలుంటాయన్నది విశ్లేషకులు మాట. అటు శ్రేయర్‌ అయ్యర్‌ కూడా సుదీర్ఘ కాలం తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎలా ఆడాతారన్నదానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, పర్దీష్ కృష్ణ, సంజు శాంసన్ (రిజర్వ్స్).

Advertisment
తాజా కథనాలు