OTT: ఓటీటీలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.ఈ రోజు నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 

OTT: ఓటీటీలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్!
New Update

Vijay Deverakonda’s The Family Star OTT: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.ఈ రోజు నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.  తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ నెల 5వ తేదీన రిలీజైన "ఫ్యామిలీ స్టార్" సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.

కానీ వాళ్లు అనుకున్నది జరగలేదు. రోజురోజుకు క్షీణించి, 2 వారాలు గడిచేసరికి థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. పరశురామ్ డైరక్ట్ చేశాడు. నెగెటివ్ టాక్ తో థియేటర్లలో మిస్సయిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ బజ్ కనుక కార్యరూపం దాలిస్తే అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ స్టార్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం.

Also Read: ‘పుష్ప 2’ కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

#ott #amazon-prime-video #vijay-deverakonda #family-star
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe