Vijay Deverakonda’s The Family Star OTT: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.ఈ రోజు నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ నెల 5వ తేదీన రిలీజైన "ఫ్యామిలీ స్టార్" సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
laughter, tears and everything in between. Welcome to the family! 💙#TheFamilyStarOnPrime, watch now https://t.co/jKh8PJuseE pic.twitter.com/QGRCFIcs4i
— prime video IN (@PrimeVideoIN) April 25, 2024
కానీ వాళ్లు అనుకున్నది జరగలేదు. రోజురోజుకు క్షీణించి, 2 వారాలు గడిచేసరికి థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. పరశురామ్ డైరక్ట్ చేశాడు. నెగెటివ్ టాక్ తో థియేటర్లలో మిస్సయిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ బజ్ కనుక కార్యరూపం దాలిస్తే అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ స్టార్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం.
Also Read: ‘పుష్ప 2’ కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?