Dinner Time: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!

తిన్న వెంటనే చాలామంది నిద్రపోతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. కొన్నిసార్లు గుండెల్లో మంట పుడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కారణంగా షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంది.

Dinner Time: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!
New Update

డిన్నర్‌(Dinner) చాలా ముఖ్యం. చాలా మంది డిన్నర్‌ని లైట్‌ తీసుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం తింటే చాలులే.. నైట్‌ తినకున్నా ఏం కాదులే అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు.. డిన్నర్‌ కూడా చేయాలి.. అయితే అది మితంగా ఉండాలి. అయితే మరికొంతమంది డిన్నర్ చేయగానే బెడ్‌ ఎక్కి వాలిపోతారు. అలా ఫోన్‌ చూస్తూ ఛాటింగ్స్‌ చేస్తూ నిద్రపోతారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. అసలు తినగానే నిద్రపోవడం అన్నది రాంగ్‌. అలా చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

అజీర్ణం..గుండెల్లో మంట:
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది. దీని వల్ల అజీర్ణం, అసౌకర్యం, నిద్రకు భంగం కలిగించవచ్చు. రాత్రిపూట పేలవమైన జీర్ణక్రియ బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు శరీరం శక్తి కోసం వాటిని బర్న్ చేస్తుంది. ఎక్కువ కేలరీలను నిల్వ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మీ నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. తినగానే నిద్రపోతే గుండెల్లో మంట పెరుగుతుంది. స్పైసీ భోజనం చేసినట్లయితే ఈ మంట కాస్త అధికంగా ఉంటుంది

ఎప్పుడు తినాలి?
కడుపు నిండా తిని వెంటనే నిద్రపోవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. ఇక రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. అటు చాలా మంది వైద్యనిపుణులు రాత్రి 8గంటల లోపే భోజనం చేయాలని సూచిస్తుంటారు. అయితే సిటీల్లో వర్క్ చేసేవాళ్లకి లేదా.. మరికొందరికి ఈ టైమ్‌లో డిన్నర్ చేయడం కుదరకపోవచ్చు. అందుకే మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, రాత్రి భోజనానికి, నిద్రవేళ మధ్య కనీసం 2-3 గంటల విరామం తీసుకోవడం మంచిది. ఇది సరైన జీర్ణక్రియను అనుమతిస్తుంది. ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read: రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు సచిన్‌, కోహ్లీ! లిస్ట్‌లో ఇంకెవరున్నారంటే?

WATCH:

#health-tips #life-style #sleep-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి