Fact Check : చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!

ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌తో భారతదేశం చరిత్ర సృష్టించింది. ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై నెమ్మదిగా అడుగులు వేసిన అద్భుతమైన వీడియోను ఇస్రోను విడుదల చేసింది. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. కానీ ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ చందమామపై తిరుగుతున్నట్లు కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చెక్ చేసినప్పుడు...అది ఫేక్ వీడియోలుగా అని తేలింది. అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందాం.

Fact Check : చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!
New Update

Fact Check : ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో భారతదేశం చరిత్ర సృష్టించింది. ల్యాండింగ్‌కు ముందు, చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్ర ఉపరితలానికి సంబంధించిన అనేక చిత్రాలను పంపింది. ఆ వీడియోలను ఇస్రో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవతున్నాయి.

కానీ ప్రజ్ఞాన్ రోవర్ కు సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రుని "అంతర్గత దృశ్యాన్ని" చూపడానికి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇటీవలి భారత చంద్ర అన్వేషణ మిషన్ ఈ దృశ్యాలను షేర్ చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో వెనుక వాస్తవం భిన్నంగా ఉందని RTV ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ కనుగొన్నది.

ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల గురించి ఇస్రో శాస్త్రవేత్తలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వీడియోలు వాస్తవమని ఎక్కడా నిరూపితం కాలేదు. కొందరు ఇస్రో మాజీ ఉద్యోగులను సంప్రదించగా..ఇస్రోకు సంబంధించి ఏ సమాచారమైనా ఇస్రోకు చెందినటు వంటి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మాత్రమే సమాచారం పౌరులకు తెలియజేస్తుందని పేర్కొన్నారు.

ఈ వీడియోలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు..ఇస్రో అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను చెక్ చేయగా... ప్రజ్ఞాన్ రోవర్ 8.మీటర్లు నడిచిన విషయాన్ని ఇస్రో ట్విట్ ద్వారా మాత్రమే తెలియజేసింది. ఎలాంటి వీడియోలను షేర్ చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలన్నీ కూడా హాలివుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు చెందినవిగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి:  రీల్స్ చేయాలనుందా? మీ బడ్జెట్‎లోనే అదిరిపోయే స్మార్ట్‎ఫోన్ ..!!

#social-media #chandrayan-3 #fact-check #prajnan-rover-fake-videos
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe