Mumbai Indians: ఎంత ఖర్మ పట్టిందిరా బాబు.. రోహిత్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు ముంబై ఏం చేసిందో చూడండి!

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ను ఎంపిక చేయడం పట్ల ఫ్రాంచైజీపై రోహిత్‌ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీ నిర్ణయానికి నిరసనగా ఇన్‌స్టాలో MI పేజీను అన్‌ఫాలో చేస్తున్నారు. దీంతో ముంబై ఇండియన్స్‌ ఫేక్‌ ఫాలోవర్స్‌(బాట్‌)ను తెచ్చుకుంటుందని ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు.

New Update
Mumbai Indians: ఎంత ఖర్మ పట్టిందిరా బాబు.. రోహిత్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు ముంబై ఏం చేసిందో చూడండి!

వచ్చే(2024) ఐపీఎల్‌(IPL) సీజన్‌ కోసం కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(Rohit Sharma) స్థానంలో హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya)ను ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) ఫ్రాంచైజీ పట్ల హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహంలో రగిలిపోతున్నారు. కెప్టెన్సీ మార్పు స్మూత్‌గా జరగలేదని.. ఇది రోహిత్‌ను అవమానించడమేనని ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు. గుజరాత్‌ నుంచి ట్రేడ్‌ చేసి తెచ్చుకున్న పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నది ఫ్యాన్స్‌ వాదన. ముంబైని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్‌ని తక్కువ చేశారని కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే కెప్టెన్సీ మార్పు భవిష్యత్‌ ప్రణాళికల దృష్ట్యా జరగిందని ముంబై ఫ్రాంచైజీ చెప్పుకొచ్చింది. అయినా కూడా ఇది పద్ధతిగా జరగలేదని ఫ్యాన్స్‌ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ముంబై జెర్సీలను తగలబెడుతుండగా.. మరికొంతమంది సోషల్‌మీడియాలోని ముంబై అఫిషియల్‌ హ్యాండిల్స్‌ను అన్‌ఫాలో కొడుతున్నారు. దీంతో ముంబై ఇండియన్స్‌ ఫేక్‌ ఫాలోవర్స్‌ను యాడ్‌ చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

publive-image ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఫేక్‌ ఫాలోవర్స్‌

ఫేక్‌ ఫాలోవర్స్‌ను తెచ్చుకుందా?
ముంబై ఇండియన్స్‌ అఫిషియల్‌ ఇన్‌స్టా పేజీలో ఫేక్‌ ఫాలోవర్స్‌ ఐడీలు వచ్చాయంటూ పలువురు రోహిత్‌ శర్మ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇదంతా బాట్‌(Bot)ఫాలోయింగ్ అని.. రోహిత్ శర్మ ఫ్యాన్స్‌ అన్‌ఫాలో చేయడంతో భారీగా పడిపోతున్న ఫాలోయిర్స్‌ సంఖ్యను కప్పిపుచ్చుకునేందుకు బాట్‌ ఫాలోవర్స్‌తో ఫాలో చేయిస్తుందన్నది వారి వాదన. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు వాట్సాప్‌లోనూ చక్కర్లు కొడుతున్నాయి.

publive-image ఫేక్‌ ఫాలోవర్స్‌ తెచ్చుకుంటున్నారని ముంబై ఇండియన్స్‌ ఇన్‌స్టా పేజీపై రోహిత్‌ ఫ్యాన్స్‌ ఆరోపణలు

భారీగా తగ్గుతున్న ఫాలోవర్స్‌ సంఖ్య:
రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ కు ట్విటర్‌లో 8.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఇప్పుడది 8.2 మిలియన్లకు పడిపోయింది. అంటే 4 లక్షల మంది వరకూ ఫాలోవర్లు ట్విటర్ లో ముంబై ఫ్రాంచైజీని వీడారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడా ఫాలోయింగ్‌ క్రమంగా తగ్గుతోంది. కెప్టెన్ గా రోహిత్ ను తప్పిస్తున్నట్టు చేసిన ప్రకటనకు ముందు ఇన్‌స్టాలో ముంబై ఇండియన్స్ కు 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 12.7 మిలియన్లకు చేరింది. దీంతో అత్యధిక ఫాలోవర్లున్న ఐపీఎల్ టీంల లిస్టులో ముంబై రెండో స్థానానికి పడిపోయింది. అంటే, ఒక్క రోజు వ్యవధిలోనే నాలుగు లక్షల మంది ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసేశారు. అయితే, మొన్నటివరకు ఇన్‌స్టాలో 13 మిలియన్ల ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్న సీఎస్కేకు ఇప్పుడు 13.1 మిలియన్ల ఫాలోవర్లు రావడం విశేషం.

Also Read: ధోనీ వర్సెస్‌ రోహిత్‌ ఎపిక్‌ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు