Hajj : సౌదీ అరేబియా (Saudi Arabia) లో హజ్ యాత్ర ఈ ఏడాది విషాదాంతగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు చనిపోయారు. ఇప్పటి వరకు హజ్ యాత్రలో 600 మందికి పైగా యాత్రికులు చనిపోయినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. వీరిలో 90 మందికి పైగా భారతీయులు చనిపోయినట్లు సమాచారం.
ఈసారి దాదాపు 600 మందికి పైగా యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు తెలిపాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారని సమాచారం. ఇందులో 300 మందికి పైగా ఈజిప్టు దేశస్థులు ఉన్నారని సమాచారం. మరణించిన వారిలో 90 మంది భారతీయులు (Indians) ఉన్నారు. వీళ్లలో కొందరు సహజంగా..వృద్దాప్య సమస్యలతో మృతి చెందారు. మరికొందరు ప్రతికూల వాతావరణం వల్ల చనిపోయారు. ఇంకా చాలా మంది యాత్రికలుఉ తప్పి పోయారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది అని అక్కడి అధికారులు ప్రకటించారు.
ఎడారి నగరంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి. సౌదీ ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. తీవ్ర ఎండలు (Heat Waves), ఉక్కబోత వాతావరణమే అందుకు ప్రధాన కారణం. హజ్ యాత్ర చేసే వారిలో వృద్దులు, మధ్య వయసు వారు ఎక్కువ మంది ఉంటారు. వీరంతా ఎండ వేడికి తట్టుకోలేక చనిపోతున్నారు.
అయితే ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది అధిక స్థాయిలో యాత్రికులు చనిపోవడం మాత్రం ఊహించలేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.