Telangana: గురుకులాల్లో ఆ దరఖాస్తులకు గడువు పొడిగింపు

తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో ప్రవేశాలకోసం జనవరి 20 వరకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

New Update
Telangana: గురుకులాల్లో ఆ దరఖాస్తులకు గడువు పొడిగింపు

Telangana: తెలంగాణ గురుకులాల్లో చదవాలనుకునే విద్యార్థులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు అధికారులు. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

దరఖాస్తు గడువు పొడిగింపు..
ఈ మేరకు గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ హెచ్‌. అరుణకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో ఇంగ్లీష్‌ మీడియంలో 5వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

అలాగే విద్యార్థుల ఎంపిక పాత జిల్లా యూనిట్‌గా పరిగణిస్తామని అరుణకుమారి తెలిపారు. ప్రస్తుతం 4తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, విద్యార్థులు బోనఫైడ్‌ లేదా స్టడీ కండక్ట్‌ సర్టిఫికెట్‌ను దరఖాస్తు వెంట జత చేయాల్సి ఉంటుందని ఈ నోటిఫికేషన్ లో మెన్సన్ చేశారు.

ఇది కూడా చదవండి : Mental Illness : ఆ సిటీలో ఎక్కువకాలం ఉన్నారో మానసిక రోగి అవ్వడం పక్కా..మతిమరుపు గ్యారెంటీ..!!

జవహార్ నవోదయ ప్రవేశాలు..
ఇదిలావుంటే.. జవహార్ నవోదయ విద్యాలయంలో 2024-25 సంవత్సరానికి సబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి జనవరి 20న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు నవోదయ ప్రిన్సిపల్ మంగతాయారు స్పష్టం చేశారు. 80 సీట్లు భర్తీ చేయనుండగా ఈ పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 7,105 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని, 36 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షను ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ నిర్వహించబోతున్నట్లు అధికారిక ప్రటకన విడుదల చేశారు.

మోడల్ స్కూల్స్..
అలాగే తెలంగాణ మోడల్ స్కూల్స్ లోనూ ప్రవేశ ప్రకటన విడులైంది. 2024-25 విద్యా సంవత్సరం కోసం 6-10వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ చేయనుండగా.. ఇందుకోసం జనవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకూ ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7త తేదిన నిర్వహించబోతున్నగ్లు స్పష్టం చేసింది.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్పదించండి:  https:telanganams.cgg.gov.in/

Advertisment
తాజా కథనాలు