వాయు కాలుష్యం ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తమ పరిశోధనల్లో తెలిపాయి. అయితే ఈ కాలుష్యం క్యాన్సర్లకు కూడా దారితీస్తుందని మరో అధ్యయనంలో బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు ఢిల్లీ ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని!
వాయు కాలుష్యం క్యాన్సర్ ముప్పు కారకు కారణం అవుతాయనే ఆధారాలున్నాయని.. ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణలు తెలిపారు. శ్వాసకోస వ్యవస్థను వాయు కాలుష్యం దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ వాయు కాలుష్యానికి గుండెపోటు, అర్ధరైటిస్, స్ట్రోక్స్ వంటి హృద్రోగాలకు సంబంధాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలినట్లు చెప్పారు. అలాగే ఇప్పటికే ఉన్న పలు రకాల క్యాన్సర్లతో వాయు కాలుష్యానికి సంబంధం ఉందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వాయు కాలుష్యం మనుషుల డీఎన్ఏను నాశనం చేయడంతో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. వాయుకాలుష్యంతో శరీరంలో వాపు ప్రక్రియ పెరగడం, అలాగే రోగనిరోధక వ్యవస్థను క్షీణింపచేయడంతో క్యాన్సర్ కణాలతో శరీరం పోరాటం చేయడం కష్టంగా మారుతుందని వెల్లడించారు. అందుకే వాయుకాలుష్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
Also Read: రేపే మిజోరాం ఎన్నికలు.. ఆ మూడు పార్టీల మధ్యే గట్టి పోటీ..