Jobs: ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే వార్త...రిలయన్స్ లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!!

రిలయన్స్ యువ ఇంజనీర్ల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్ పేరుతో తన ఎంట్రీ-లెవల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు జనవరి 11 నుంచి 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

Jobs: ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే వార్త...రిలయన్స్ లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!!
New Update

Reliance Get 2024: భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance Industries Limited) గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్‌(Graduate Engineer Trainee Programme)ను ప్రారంభించింది. ఇది పెట్రోకెమికల్స్(Petrochemicals) నుండి కొత్త ఎనర్జీ (New energy)వరకు వ్యాపారాలలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను నియమించుకునేందుకు ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్(Recruitment drive) నిర్వహిస్తోంది. యువ ఇంజనీర్ల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్ పేరుతో తన ఎంట్రీ-లెవల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్ కు చెందిన పలు వ్యాపార విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొంది.

ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ చేపట్టింది కంపెనీ. ఈ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ జనవరి 11 నుండి జనవరి 19వరకు నమోదు చేసుకోవచ్చిన తెలిపింది. బి.టెక్, బి.ఇ. విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024 బ్యాచ్‌లో AICTE- ఆమోదించబడిన సంస్థల నుండి రసాయన, విద్యుత్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి వివిధ స్ట్రీమ్‌ల నుండి గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది.

మార్చి 1 వరకు ఇంటర్వ్యూ :

షార్ట్‌లిస్ట్ చేయబడిన విద్యార్థులు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 8 మధ్య ఆన్‌లైన్ మూల్యాంకనం (కాగ్నిటివ్ టెస్ట్ మరియు సబ్జెక్ట్ మ్యాటర్) చేయించుకోవాల్సి ఉంటుందని రిలయన్స్ తెలిపింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలుస్తారు. మార్చి చివరి నాటికి తుది ఎంపిక జరుగుతుంది.

ఇది కూడా చదవండి:  ఒప్పో నుంచి రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్…ధర, ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు..!!

అర్హతలు:

బీటెక్, బీఈ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చే. ఏఐసీటీఈ ఆమోదించిన విద్యాసంస్థల నుంచి కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు అప్లయ్ చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఆన్ లైన్ లో టెస్ట్ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇంజనీరింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం https://relianceget2024.in/ లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోవచచు. అందులో అర్హత, నియామక ప్రక్రియ, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వివరాలు పూర్తిగా ఉన్నాయి. అభ్యర్థులు 10,12 డిప్లొమాలో 60శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ 60శాతం మార్కులు సాధించిన వారు అర్హులుగా నిర్ణయించింది.

#jobs #reliance #reliance-get-2024 #engineers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe