Kadapa : హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్‌పై మాజీ మంత్రి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వివేకా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
Kadapa : హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి?

CM JAGAN : మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) జరగనున్న తరుణంలో పులివెందుల(Pulivendula) లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పులివెందుల అసెంబ్లీ బరిలో మాజీ మంత్రి వివేకా(Minister Vivekananda Reddy) సతీమణి సౌభాగ్యమ్మ(Soubhagyamma) ఉండబోతున్న తెలుస్తోంది. కాంగ్రెస్(Congress) నుంచి పోటీ చేయించాలని వివేకా కుటుంబ సభ్యులు, అభిమానులు భావిస్తున్నట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: AP Elections: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

ఈ క్రమంలో జగన్ పై పోటీకి దించాలని వివేకా కుమార్తె సునీత ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే ఆలోచనలో కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్న వివేకా అభిమానులు. సీఎం జగన్ పై పోటీ చేసేందుకు సౌభాగ్యమ్మే దీటైన అభ్యర్థని వివేకా అనుచరులు బావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కడప నుంచి ఎంపీ గా షర్మిల

మరికొన్ని నెలల్లో లోక్‌ సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల నుంచి ఎంపీలుగా ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన వైఎస్‌ షర్మిలకు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే షర్మిల కడప(Kadapa) నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆమె బంధువులు, అనుచరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలానేనని ఆమె అనుచరులు చెబుతున్నారు.

Also Read :Tirupati: చిల్లరతో లక్షల బండి… నువ్వు మాములోడివి కాదు బాసూ..!

DO WATCH:

Advertisment
తాజా కథనాలు