Group-1 Mains: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష సమయాల్లో మార్పులు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయాల్లో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. గతంలో నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 PM నుంచి సాయంత్రం 5.30 PM గంటల వరకు నిర్ణయించగా.. ఇప్పుడు 2.00 PM నుంచి 5.00 PM గంటలకు మార్చింది. By B Aravind 16 Aug 2024 in జాబ్స్ ఆదిలాబాద్ New Update షేర్ చేయండి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న పరీక్ష సమయాల్లో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే నిర్వహించనుంది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 PM గంటల నుంచి సాయంత్రం 5.30 PM గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ సమయాన్ని మధ్యాహ్నం 2.00 PM గంటల నుంచి సాయంత్రం 5.00PM గంటలకు మార్పు చేసింది. Also Read: పిల్ల, పిల్లగాడి లగ్గానికి రావాలే.. తెలంగాణ యాసలో పెళ్లి కార్డు ఇదిలాఉండగా తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి జూన్ 9న జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెయిన్స్ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్ 1 పరీక్షకు రాష్ట్రంలో 4.03 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మంది హాజరయ్యారు. జులైలో విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాల్లో 31 వేల మందికి పైగా అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. Also Read: బీజేపీలో ఆప్ విలీనం.. సిసోడియా బెయిల్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు! #telangana #telugu-news #group-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి