ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వరల్డ్ కప్ మ్యాచ్‌కు సంబంధించి 'ఆర్టీవీ'తో పలు కీలక విషయాలు పంచుకున్నారు. ' టీం ఇండియాలో ఒకటి నుంచి 11 వరకు అందరూ కూడా ఫామ్‌లో ఉన్నారు. హోం గ్రౌండ్‌లో ఆడటం టీం ఇండియాకు అడ్వాంటేజ్. అహ్మదాబాద్ పిచ్ మంచి క్రికెటింగ్ పిచ్. మన గేమ్ మనం ఆడితే ఆస్ట్రేలియా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఫైనల్‌లో టాస్ ఎవరూ గెలిచినా.. గెలిచేది ఇండియానే. ఆస్ట్రేలియా కూడా మంచి క్రికెట్ ఆడుతుంది. న్యూజిలాండ్ మ్యాచ్‌కు ముందు వరకు అన్ని వన్‌సైడ్ మ్యాచ్‌లే జరిగాయి. ఈ మ్యాచ్ తర్వాత ఇండియా క్రికెటర్లు ఫైనల్‌కు మరింత సిద్ధమైపోయారు. ఫైనల్‌లో మనవాళ్లు ఒకరిద్దరు మంచిగా బ్యాటింగ్ చేసిన గెలుపు మనదే'. అని అంబటి రాయుడు వివరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి.
Also Read: బీడీ కార్మికులకు రూ.5,000 పెన్షన్.. కవిత ప్రకటన!