Radha Kishan Rao : మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి మృతి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిష్ రావు తల్లి ఈ రోజు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె కరీంనగర్ హాస్పిటల్ లో మరణించారు. తల్లి మృతి పై రాధా కిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 03 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ex. Taskforce DCP : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Issue) లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు (Radha Kishan Rao) తల్లి ఈ రోజు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె కరీంనగర్ హాస్పిటల్ (Karimnagar Hospital) లో మరణించారు. రాధా కిషన్ రావు తల్లి పార్కిన్ సన్ వ్యాధితో బాధపడ్డారు. రాధా కిషన్ రావు తల్లి పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్నారు.తల్లి మృతి పై రాధా కిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. రాధా కిషన్ రావు పిటిషన్ పై మరికాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు చెప్పనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్‌లో తన నేరాలను ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నల్లోనే జరిగిందని.. ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశామని, దాని ద్వారా ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యాపారవేత్తల కార్యకలాపాలపై ఎక్కువగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న కొంత మంది అనుమానిత నేతలపై కూడా నిఘా పెట్టామని తెలిపారు. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక బై పోల్ సమయంలో నిఘా పెంచామని అంగీకరించినట్లు తెలిపారు. 2016 నుంచి ఓ వర్గానికి చెందిన అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు రాధాకిషన్ రావు అంగీకరించారు. భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘున్ రావు, ఆయన బంధువుల నుంచి రూ. కోటి, ఇక మునుగోడు బై ఎలక్షన్ (By-Election) టైమ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఒప్పుకున్నారు. Also Read: కవితకు దక్కని ఊరట..జులై 3 వరకు రిమాండ్ #died #mother #task-force-dcp #radha-kishan-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి