EX Principal Sandeep Ghosh: వైద్యం చేసే ధైర్యంతో పాటూ సున్నితత్వం కూడా డాక్టర్లకు ఉండాలని అంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. కోలకతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు ఇవేమీ లేవని అందుకే అతనిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. ట్రైనీ డాక్టర్ హత్య, రేప్ విషయంలో డాక్టర్ ఘోష్ ప్రవర్తన అమానవీయంగా ఉందని చెప్పింది. ఆర్జీ కర్‌కు ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో సందీప్ ఎన్నో అవినీతి పనులు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఘోష్ మృతదేహాలను, బయో మెడికల్ వ్యర్ధాలను అక్రమంగా రవాణా చేశారని ఆర్జీకర్ ఉద్యోగులు ఆరోపించారు. సీబీఐ కూడా ఇతని ఇంట్లో 11 గంటల పాటూ సోదాలను నిర్వహించి సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత సందీప్ ఘోష్‌పై సీబీఐ ఆగస్టు 24న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఘోష్ పదవీకాలంలో మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇతనికి సీబీఐ సోమవారం లై డిటెక్టర్ టెస్ట్‌ను కూడా నిర్వహించింది.
ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను బెంగాల్ ప్రభుత్వం కాపాడ్డానికి ట్రై చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతని వెనుక ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ట్రైనీ డాక్టర్ హత్య కు సందీప్ నైతిక బాధ్యత వహిస్తూ ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశాడు. అయితే ఆ తరువాత అతనిని వెంటనే బెంగాల్ ప్రభుత్వం అతన్ని కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు నాయకత్వం వహించడానికి నియమించింది. ఇది చాలా విమర్శలకు దారి తీసింది. దాంతో సందీప్‌ను దీర్ఘకాల సెలవుపై వెళ్ళాలని కోలకత్తా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా సందీప్ ఘోష్‌ను కాపాడ్డానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది అంటూ మండిపడింది.
Also Read: Telangana: శ్రీశైలం, నాగార్జునా సాగర్ కు భారీ వరద నీరు..గేట్లు ఎత్తిన అధికారులు