Tirupati : సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేకు రూ. 50 లక్షల టోకరా సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడికి ఓ మహిళ ఫోన్ చేసి చేసింది. మీ ఖాతా నుంచి మనీల్యాండరింగ్ జరిగిందని బెదిరించింది. ఆమెతో పాటూ మరో నిందితుడు కలిపి జయదేవనాయుడి దగ్గర నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Manogna alamuru 10 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ex MLA Jayadeva Naidu Lost 50 Lakhs From Hackers : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు (85) మోసగాళ్ల చేతిలో చిక్కి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. గత శనివారం ఆయనకు ఫోన్ చేసిన ఓ మహిళ మీ బ్యాంకు ఖాతా (Bank Account) నుంచి కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని, తాము అరెస్ట్ చేసిన నాయక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పింది. మనీల్యాండరింగ్ కేసు (Money Laundering Case) లో మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని బెదిరించింది. మనీల్యాండరింగ్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదని జయదేవనాయుడు చెప్పడంతో, అయితే తమ పై అధికారితో మాట్లాడాలంటూ ఫోన్‌ను మరో వ్యక్తికి కనెక్ట్ చేసింది. అతడు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ తాము ఫోన్ చేసిన విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు తెలిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పి మరింత బెదిరించాడు. తాము సీబీఐ అకౌంట్ నంబర్ పంపిస్తామని, ఆ ఖాతాకు మీ ఖాతాలోని డబ్బులు పంపిస్తే తనిఖీ చేసి మూడు రోజుల్లో తిరిగి డబ్బులు బదిలీ చేస్తామని చెప్పడంతో నిజమేనని నమ్మిన జయదేవనాయుడు శనివారం బ్యాంకుకు వెళ్లి ఆరు ఖాతాల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ. 50 లక్షలు పంపించారు. ఆదివారం అమెరికా (America) నుంచి కుమారుడు ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పారు. దీంతో ఆయన మోసపోయినట్టు గ్రహించి వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు నిన్న సాయంత్రం జయదేవనాయుడు తిరుపతి (Tirupati) జిల్లా పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:Cricket: మూడో మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద భారత వుమెన్స్ జట్టు గెలుపు-సీరీస్ సమం #tirupati #hackers #money-laundering-case #jayadeva-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి