EX MLA Jaggareddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను సీఎం పదవి నుంచి దిగిపోగానే తెలంగాణలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి అని కేసీఆర్ అన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసలు బాధ కరెంట్ గురించి కాదని.. తనకు, తన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేశారని బాధ అని చురకలు అంటించారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో కేసీఆర్ కు ఏం చేయాలో అర్ధం కావడం లేదని అన్నారు.
ALSO READ: పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ కు ఆనాడు గుర్తుకు రాని ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు వినడానికి.. నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్ని స్టాంట్స్ చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఈసారి నమ్మకనే ప్రజలు ఆయన్ని ఓడించి ఇంటికి పంపించారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థులను చూస్తే తెలంగాణలో బీజేపీ గెలిచేందుకు కేసీఆర్ కృషి చేతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా విజయం సాధించలేదని జోస్యం చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుందని అన్నారు.