ఏపీలో మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆమె క్రీడలు, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఓ కమిటీ వేశారు. దోషులను గుర్తించి డబ్బులు రికవరీ చేస్తామని తెలిపారు.
Also read: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
గతంలో రోజా.. అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వాటిని నిరూపించాలంటూ ఆయన సవాల్ చేశారు. లేదంటే మేమే రోజా చేసిన వంద కోట్ల అవినీతిని నిరూపిస్తామని అన్నారు. ఇదిలాఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీచేసిన రోజా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారడంతో.. ఆమెపై అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశమవుతోంది. ఆమె అరెస్టు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు చెబుతున్నారు.
Also Read: ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదు.. అందుకే జగన్ కు శాపం తగిలింది : శ్రీరామ శర్మ