Malla Reddy: 'ఏం జెయ్యాలే సారూ'.. కేసీఆర్‌తో మల్లారెడ్డి మంతనాలు!

కేసీఆర్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అక్రమనిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గత కొంత కాలంగా పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్‌కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం.

New Update
Malla Reddy: 'ఏం జెయ్యాలే సారూ'.. కేసీఆర్‌తో మల్లారెడ్డి మంతనాలు!

Malla Reddy: గతంలో అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ని తిట్టడం ఇప్పుడు మల్లారెడ్డికి తలనొప్పిగా మారింది. మల్లారెడ్డే టార్గెట్ గా.. ఆయన అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో తన ఆస్తులను, అక్రమకట్టడాలను కాపాడుకునేందుకు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ సలహాదారుడు నరేందర్ రెడ్డితో గురువారం మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ కావడంతో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.

ALSO READ: ఢిల్లీలో సీఎం రేవంత్.. 9 మందితో తొలి జాబితా?

సారూ నువ్వే చూసుకోవాలే..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఆయన కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి నందినగర్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. ఆక్రమణల్లో నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించారు. అలాగే మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారంపై కేసీఆర్ అరా తీసినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నా కొడుక్కి ఎంపీ టికెట్ వద్దు..

పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మల్లారెడ్డి. మాజీ కేసీఆర్ తో తాను పార్టీ మారబోననని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్ గిరి ఎంపీ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన మల్లారెడ్డి.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరు రారు అని.. మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి ఎవరిని నిలబెట్టిన పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

నీకు ఏం కాదు కాకా.. కేటీఆర్ భరోసా..

మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు మల్లారెడ్డి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కేటీఆర్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేత వల్ల అయోమయంలో ఉన్న మల్లారెడ్డికి కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. "నువ్వు గిట్ల అయితే ఎట్లా కాకా.. నువ్వు ఫైర్ బ్రాండ్.. నీకు ఏం కాదు.. బీఆర్ఎస్ పార్టీ నిన్ను కాపాడుకుంటుంది.. ఏం ఆలోచించకు మేము ఉన్నాము" అని కేటీఆర్ మల్లారెడ్డికి మోటివేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు