KTR: ఈ నెల 12న కరీంనగర్‌లో బహిరంగ సభ: కేటీఆర్‌

తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 12న కరీంనగర్‌లో 'కదన భేరీ' పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

New Update
Breaking: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..

లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) పై బుధువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈరోజు (మంగళవారం) కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్‌ నేతలో ఆయన సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటోందని విమర్శలు చేశారు. డిసెంబర్‌ 9న అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ మాట తప్పారని మండిపడ్డారు.

Also Read: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

కదన భేరీ సభ

మరోవైపు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై కూడా కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్‌.. కరీంనగర్‌కు చేసిందేమి లేదని విమర్శలు చేశారు. మతం, అయోధ్య పేర్లతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని విమర్శలు చేశారు. అయితే ఈ నెల 12న కరీంనగర్‌లో 'కదన భేరీ' పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ VS కాంగ్రెస్

ఇదిలాఉండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి అనంతరం ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తరచూ విమర్శలు చేస్తూ వస్తున్నాయి. మరోవైపు మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ గట్టి ప్రయాత్నాలు చేస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్‌తో.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఇటీవల పలు సర్వేలు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రానున్నట్లు అంచనా వేశాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈనెలలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ కూడా రానుంది. మరీ తెలంగాణ ప్రజలు ఏ పార్టీని ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలిపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.

Also Read: ‘బడే భాయ్’ అని పిలిచి మోడీని చిక్కుల్లో పెట్టిన సీఎం రేవంత్!

Advertisment
Advertisment
తాజా కథనాలు