Telangana: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం తొలగించడం మూర్ఖపు నిర్ణయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అమర వీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని.. ఉన్నవాటిని తొలగించడం తప్పుడు నిర్ణయమని అన్నారు.

New Update
MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు

KTR On Telangana State Emblem: తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాంగ్రెస్ సర్కార్‌ మార్పులు చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ 2న రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ'తో పాటు.. కొత్త లోగో ఆవిష్కరించనున్నట్లు కాంగ్రెస్ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితో తాజాగా రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణను వాయిదా వేశారు. అయితే తాజాగా రాష్ట్ర చిహ్నం మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందించారు. ప్రభుత్వం.. నగర ప్రగతి కనిపించకుండా చేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి చార్మినార్ (Charminar) వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

Also Read: ఎవరెస్ట్ శిఖరం పై ట్రాఫిక్ జామ్..వైరల్ అవుతున్న పోస్ట్!

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ' రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం అనేది హైదరబాదీలను విస్మరించడమే. చిహ్నంలో చార్మినార్‌తో పాటు కాకతీయ తోరణం తొలగించడం ముర్ఖపు నిర్ణయమే. హైదరాబాద్‌ ఐకాన్‌గా చార్మినార్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అమర వీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్నవాటిని తొలగించడం తప్పుడు నిర్ణయం. తెలంగాణ ఉద్యమం గురించి సీఎం రేవంత్‌కు తెలియదు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. లోగో మార్పుపై బీఆర్‌ఎస్‌ తరఫున నిరసనలు చేస్తామని' కేటీఆర్ అన్నారు.

Also Read: అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తున్న నెల వయసు శిశువు.. వేకువజామున చూసేసరికి..!

Advertisment
తాజా కథనాలు