KTR: మాజీ మంత్రి కేటీఆర్.. చమురు, నిత్యావసర ధరల పెరుగదలకు సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ' ప్రతి భారతీయుడు దీని గురించి ఆలోచించాల్సి ఉంది. 2014 నుంచి ముడి చమురు ధరలు దాదాపు 20 డాలర్లు తగ్గాయి. కానీ అదే దశాబ్దంలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.35 పెరిగాయి మరియు డీజిల్ ధరలు లీటరుకు రూ.40 పెరిగాయి. దీనికి ఎవరిని నిందించాలి ?.నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలి?' అంటూ ప్రశ్నించారు. సెరీస్ అనే ఎక్స్(ట్విట్టర్) ఖాతాదారుడు పెట్టిన పోస్టుకు రీట్వీట్ చేస్తూ.. కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.
Also Read: టిక్కెట్ అడిగిన టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు