BREAKING: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఎంపీలకు కబురు

మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల బీఆర్ఎస్ ఎంపీలు వెంటనే హైదరాబాద్ రావాలని పిలిచినట్లు సమాచారం.

BREAKING: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఎంపీలకు కబురు
New Update

BRS Chief KCR: ఎన్నికల ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. ఇటీవల యశోద ఆసుపత్రిలో తుంటికి సర్జరీ అయ్యి కేసీఆర్ డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వరాల సమయం పడుతుందని చెప్పారు.

ALSO READ:  పెన్షన్‌ రూ. 4వేలకు పెంపు.. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌.. ఆ రోజునుంచే?

పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ నజర్..

వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోగా.. ఆ పార్టీ నేతల్లో నిరాశ పెరిగింది. అయితే, పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించేలా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల ఎంపీలు వెంటనే హైదరాబాద్ రావాలని ఆదేశం ఇచ్చినట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహాలపై వారితో చర్చించనున్నారు. సోమవారం సాయంత్రం ఎంపీలతో ఫోన్‌లో కేసీఆర్ మాట్లాడారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది.

ఓడిన మంత్రులకు ఛాన్స్..?

మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో ఎవరు దిగుతారనే చర్చ మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీలకు హైదరాబాద్ రావాలని కబురు పంపగా.. మళ్లీ వారికే టికెట్ ఇస్తారా? లేదా ? అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ మంది మంత్రులు ఓడిన విషయం తెలిసిందే. అయితే, వారికి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. వారికి టికెట్ కేటాయిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కేసీఆర్ ఎవరి టికెట్ ఇస్తారనేది వేచి చూడాలి.

ALSO READ: పథకాల కోసం డబ్బులు లేవు.. సీఎం వీడియో వైరల్

#kcr #breaking-news #brs-party #mp-elections #brs-mps
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe