రూమ్ కొస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. ఈవీవీపై షకీలా ఆరోపణలు ప్రముఖ నటి షకీలా దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా అవకాశాలు కావాలంటే ఒకసారి తన రూమ్ కు రమ్మన్నారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈవీవీగారు నన్ను అడ్జెస్ట్ మెంట్ అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇంకెప్పుడూ ఆయనను కలవలేదు అన్నారు. By srinivas 29 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి సీనియర్ నటి షకీలా తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అన్నారు. సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు చాలామంది తనను కమిట్ మెంట్ అడిగారని చెప్పారు. ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏకంగా రాత్రికి తన రూమ్ కు రమ్మని పిలిచాడని, తాను చెప్పినట్లు వింటే వరుస ఆఫర్లు ఇస్తానంటూ లొంగ దీసుకునేందుకు ప్రయత్నిం చేశాడని చెప్పారు. Also read :ఐదేళ్ల బాలికలపై స్కూల్ క్యాబ్ డ్రైవర్ దారుణం.. అక్కడికి తీసుకెళ్లి తెలుగు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా వచ్చిన షకీలా హౌస్ లో ఉన్నంత సేపు ప్రేక్షకులను అలరించారు. అయితే ఇటీవలే హౌస్ నుంచి బయటకు వచ్చిన నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. పర్సనల్ అండ్ కెరీర్ అనుభవాలను పంచుకున్నారు. అల్లరి నరేష్ తండ్రి, దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ నన్ను అడ్జెస్ట్ మెంట్ అడిగారు. రూమ్ కు వస్తావా? మరో సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు. నేను వెంటనే, సర్ ఈ సినిమాకు నాకు డబ్బులిచ్చేశారు. వేరే సినిమా అవసరం లేదని చెప్పాను' అని తెలిపారు షకీలా. ఈ క్రమంలోనే తమిళ బిగ్ బాస్ లో నటి విచిత్ర ఒక టాప్ తెలుగు హీరో తనను గదికి రమ్మని పిలిచాడని సంచలన వ్యాఖ్యలపై కూడా మాట్లాడిన షకిలా.. విచిత్ర వెళ్లకపోయేసరికి మరునాడు నుంచే టార్చర్ చూపించాడని తనతో చెప్పి భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. విచిత్ర నా స్నేహితురాలు, ఆమెకు జరిగిన అన్యాయం గురించి బయటకు చెప్పడం బాగుంది. కానీ ఇండస్ట్రీ వదిలేందుకు కారణమైన ఆ హీరో పేరు కూడా బయటపెడితే ఇంకా బాగుండేదన్నారు. ప్రస్తుతం షకిలా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి. #evv-satyanarayana #shakeela #casting-couch మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి