కాసరగోడ్ ఎన్నికల్లో బీజేపీకి అదనపు ఓట్లు..ఆరోపిస్తున్న ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్ నిన్న కాసరగోడ్‌లో జరిగిన మాక్ పోలింగ్‌లో కనీసం నాలుగు ఈవీఎమ్ మెషీన్లు బీజేపీకి అదనపు ఓట్లు వచ్చేలా చేశాయని ల్‌డిఎఫ్, యుడిఎఫ్ అభ్యర్థుల ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి లోపాలను పరిశీలించాలని ఎల్డీఎఫ్ అభ్యర్ధి ఎంవి బాలకృష్ణన్ జిల్లా కలెక్టర్ ఇన్‌బాశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. By Manogna alamuru 18 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కాసరగోడ్ మాక్ పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు అక్కడ లోకల్ పార్టీలు అయిన ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ అభ్యర్థులు. ఈవీఎం మెషీన్లు సరిగ్గా పని చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నాలుగు మెషీన్లలో బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఓటింగ్ మెషీన్ల మీద ఇతర గుర్తల కంటే కాంగ్రెస్ గుర్తు చిన్నగా ఉందని చెబుతున్నారు. వెంటనే ఈవీఎం మెషీన్లను మార్చాలని జిల్లా ఎన్నికల అధికారిగా నియమించబడిన జిల్లా కలెక్టర్ ఇన్‌బాశేఖర్ కెకి ఫిర్యాదు చేశారు. యుడీఎష్ అభ్యర్థి రాజ్‌మోహన్ ఉన్నితాన్ ఏజెంట్ ముహ్మద్ నాసర్ చెర్కలం ఈ ఆరోపణలను చేస్తున్నారు. కాసరగోడ్‌లో జరిగిన మొదటి రౌండ్ మాక్ పోల్స్‌లో మొత్తం 190 ఈవీఎంలలో నోటీతో సహా 10 ఆప్షన్లతో ఉన్నాయి. మొత్తం 190 ఈవీఎంలలో టెస్ట్ నిర్వహించారు. పది ఆప్షన్లలో దేనికి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి లాంటివి పరిశీలించారు. ఇందులో బీజేపీకి అదనంగా ఓట్లు వస్తున్నట్టు గుర్తించారు. ఎన్నికల అధికారులు ఒకేసారి 20 మెషీన్లను టెస్ట్ చేశారు. 10 ఆప్షన్లలో అన్నింటికీ ఒక్కో ఓటే పడితే బీజేపీకి మాత్రం రెండేసి ఓట్లు పడ్డాయి. ఇలా నాలుగు ఈవీఎం మెషీన్లలో అవకతవకలు చూపించాయి. అయితే రెండుసార్లు ఈవీఎం మెషీన్లను పరీక్షించినప్పుడు లోపాలు కనిపించాయని..కానీ మూడవసారి సరీక్షించినప్పుడు లేవని చెబుతున్నారు ఎన్నికల అధికారులు. అయితే అక్కడతో అవి ఆగిపోయాయా లేదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. ఈ మొత్తం నివేదికను కలెక్టర్‌కు ఇచ్చామని అసిస్టె్ంట్ రిటర్నింగ్ అధికారి బినుమోన్. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన మాక్ పోలింగ్‌లో మొత్తం 228 బ్యాలెట్ యూనిట్లు, 228 కంట్రోల్ యూనిట్లు, 247 వీవీప్యాట్ యూనిట్లను పరీక్షించారు. 228 యంత్రాల్లో ఆరు యంత్రాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి.వాటిని ఇంజనీర్లు సరిచేయడానికి పక్కన పెట్టారు.... Also Read:Andhra Pradesh: జగన్ కేసులో కొత్త ట్విస్ట్..బోండా ఉమపై అనుమానాలు #elections #kerala #evms #kasaragode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి